టాలీవుడ్ టాప్ స్టార్ అల్లు అర్జున్ తరచూ ముంబై ఫ్లైట్ ఎక్కడమే కాదు, అక్కడ ముంబైలో టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో భేటీ అవడం సర్వత్రా చర్చలకు దారి తీసింది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ స్ట్రయిట్ బాలీవుడ్ మూవీ చేసే ప్రయత్నాల్లో భాగంగానే అల్లు అర్జున్ తరచూ సంజయ్ లీల బన్సాలీతో మీట్ అవుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఒకసారి సంజయ్ లీలా ఆఫీస్ కి వెళ్లిన అల్లు అర్జున్ తర్వాత ఆయన ఇంటికి వెళ్లి కలవడంతో అల్లు అర్జున్ సినిమా చెయ్యడానికే ఆయనతో చర్చలు జరుపుతున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి.
లేటెస్ట్ గా టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య సంజయ్ లీలా ఇంటి దగ్గర కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది. నాగ చైతన్య ప్రస్తుతం అమిర్ ఖాన్ తో చేసిన లాల్ సింగ్ చద్దా మూవీ ప్రమోషన్స్ కోసం ముంబై లోనే ఉన్నాడు. అయితే నాగ చైతన్య నిన్న ఈవెనింగ్ సంజయ్ లీలా భన్సాలీని మీట్ అవడానికి ఆయన ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఫోటో గ్రాఫర్స్ నాగ చైతన్య ఫొటోస్ తియ్యడంతో.. చైతు - సంజయ్ లీల మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
చైతు సంజయ్ ని మీట్ అయ్యింది.. సినిమా కోసమే.. కథ చర్చల కోసమే వీరు మీటింగ్ పెట్టుకున్నారని అంటుంటే.. టాలీవుడ్ స్టార్స్ అంతా సంజయ్ లీల ఇంటి దగ్గర, అసలు టాలీవుడ్ స్టార్స్ కి బాలీవుడ్ భన్సాలీతో ఏం పని అంటూ ఫన్నీగా సోషల్ మీడియాలో కామెంట్స్ రేజ్ అయ్యాయి.