యంగ్ టైగర్ ఎన్టీఆర్ -కళ్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణ రోడ్ ఆక్సిడెంట్ లో కన్నుమూసినప్పుడు నందమూరి ఫ్యామిలీ, చంద్రబాబు ఫ్యామిలీ అంతా ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ లకి అండగా నిలిచారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి పెద్దగా రాకపోకలు ఉండవు. గతంలో కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ తో కాస్త డిస్టెన్స్ ని మెయింటింగ్ చేసినవాడే. కానీ తండ్రి హరికృష్ణ మరణంతో ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ లు కలిసిపోయారు. తర్వాత ఎక్కడికైనా ఆన్నదమ్ములు కలిసే వెళ్లేవారు. ఇప్పుడు నందమూరి ఫ్యామిలిలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి మానసిక, ఆరోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకోవడం నందమూరి ఫ్యామిలిలో విషాదం చోటు చేసుకోవడానికి కారణం అయ్యింది.
ఆమె చనిపోయిన మూడోరోజుల తర్వాత కుటుంబ సభ్యులు ఆమె అంతక్రియలు నిర్వహించారు. కారణం ఉమామహేశ్వరి పెద్దకూతురు విశాల అమెరిలో ఉంది.. రావడం లేట్ అయిన కారణంగా అలా చేసారు. ఉమామహేశ్వరి మరణం తర్వాత కళ్యాణ్ రామ్, బాలకృష్ణ, చంద్రబాబు, లోకేష్ ఇలా నందమూరి ఫ్యామిలీ అంతా ఉమా మహేశ్వరీ ఇంటికి వచ్చారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అత్త చివరి చూపుకోసం రాలేదు. ఆయన భార్య పిల్లలతో విదేశాల్లో ఉన్నారని అంటున్నప్పటికి.. అత్తా చివరి చూపు కోసం రావడానికి పెద్ద ప్రాబ్లెమ్ కాదు, కానీ ఎన్టీఆర్ అత్త కడసారి చూపులకి రాలేదు. ఆమె అంత్యక్రియల్లోను ఎన్టీఆర్ కనిపించలేదు.
ఇక ఉమామహేశ్వరి అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం మహాప్రస్థానంలో ముగిసాయి. రామకృష్ణ, బాలకృష్ణ అందరూ పాడే మొయ్యగా.. ఆమె భర్త చితికి నిప్పు పెట్టారు. లోకేష్, చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు అందరూ ఉమా మహేశ్వరీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.