Advertisementt

సలార్ రీ షూట్.. నిజమా?

Tue 02nd Aug 2022 10:11 PM
prabhas,salaar,salaar update,prashanth neel,kgf 2  సలార్ రీ షూట్.. నిజమా?
Salaar re-shoot.. is it true? సలార్ రీ షూట్.. నిజమా?
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ప్రస్తుతం ప్రభాస్ చిన్న సర్జరీ కోసం విదేశాలకు వెళ్ళడానికి రెడీ అవుతున్న కారణంగా సలార్ షూటింగ్ కి బ్రేక్ ఇవ్వబోతున్నారు. ప్రభాస్ రేపు బుధవారం హైదరాబాద్ లో జరగబోయే సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రాబోతున్నారు. అయితే ప్రశాంత్ నీల్ కేజిఎఫ్2 లో ఇచ్చిన ఎలివేషన్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలకు ఆడియన్స్ ఎక్సప్రెషన్స్ తో థియేటర్స్ దద్దరిల్లడమే కాదు, కేజిఎఫ్ కలెక్షన్స్ కళకళలాడాయి. 

అందుకే ఇప్పుడు సలార్ లోని కొన్ని యాక్షన్ సీన్స్ ని రీ షూట్ చేయబోతున్నారని, కేజిఎఫ్ ని మించిన యాక్షన్ ని సలార్ లో చూపించడానికి ప్రశాంత్ నీల్ చూస్తున్నారట. కేజిఎఫ్2 రిలీజ్ కి ముందే అంటే గత ఏడాది సలార్ ఫస్ట్ షెడ్యూల్ లో తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ ని మరోసారి రీ షూట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. గతంలో 12 కోట్ల వరకు ఖర్చు చేసిన ఆ యాక్షన్ సన్నివేశాలను మళ్లీ పర్‌ఫెక్షన్‌ కోసం అంటూ రీషూట్‌ చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ రెడీ అయ్యాడు అంటున్నారు. మేకర్స్ కూడా ప్రశాంత్ నీల్ ఎలా చెబితే అలా అనడంతో.. ఆ యాక్షన్ సీన్స్ రీ షూట్ కి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. 

Salaar re-shoot.. is it true?:

Prabhas Salaar update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ