Advertisementt

కొత్త గర్ల్ ఫ్రెండ్ పై నాగ చైతన్య రియాక్షన్

Tue 02nd Aug 2022 08:51 PM
naga chaitanya,sobhita dhulipala,samantha  కొత్త గర్ల్ ఫ్రెండ్ పై నాగ చైతన్య రియాక్షన్
Naga Chaitanya finally Reacts to rumours of dating Sobhita Dhulipala కొత్త గర్ల్ ఫ్రెండ్ పై నాగ చైతన్య రియాక్షన్
Advertisement
Ads by CJ

నాగ చైతన్య సమంత ని పెళ్లి చేసుకోకముందు, ప్రేమించకముందు పెద్దగా లవ్ స్టోరీస్ నడిపినట్లుగా ఏమి వినిపించలేదు, కనిపించలేదు. సమంత తో ప్రేమ వ్యవహారాన్ని కూడా కొన్నాళ్ళు గుట్టుగానే దాచేసాడు. పెళ్లి చేసుకునేముందు సమంత తో ప్రేమాయణాన్ని బయటపెట్టిన నాగ చైతన్య సమంత కి విడాకులిచ్చాక ఒంటరిగానే ఉంటున్నా.. మధ్యలో ఆయన హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో డేటింగ్ లో ఉన్నాడంటూ నేషనల్ మీడియా నుండి సోషల్ మీడియా వరకు ప్రచారం జరిగింది. ఈ విషయమై శోభిత కానీ, చైతు కానీ ఎక్కడా స్పందించకపోయినా.. వారి మధ్యన ఏదో ఉంది అంటూ వార్తలు వండి వార్చారు. 

అయితే ఈ విషయమై నాగ చైతన్య కి లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ లో ప్రశ్నలు ఎదురయ్యాయి. మీరు శోభిత దూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి అది నిజమేనా.. ఆ వార్తలు చూసాక మీ రియాక్షన్ ఏమిటి అని యాంకర్ అడగగా.. దానికి నాగ చైతన్య ఇలాంటి వార్తలు చూసి నేను నవ్వుతాను అంటూ డిఫరెంట్ గా ఆన్సర్ ఇచ్చాడు కానీ.. శోభిత కి తనకి మధ్యన ఎలాంటి ఎఫ్ఫైర్ లేదు అని మాత్రం చెప్పకుండా కన్ఫ్యూజ్ చేసాడు. 

Naga Chaitanya finally Reacts to rumours of dating Sobhita Dhulipala:

Naga Chaitanya Reacts to dating rumours with Sobhita Dhulipala: Im just gonna smile

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ