Advertisementt

లుక్ మార్చిన మహేష్ బాబు

Tue 02nd Aug 2022 08:04 PM
mahesh babu,mahesh new look,ssmb 28,sitara,goutham,namratha  లుక్ మార్చిన మహేష్ బాబు
Mahesh look change లుక్ మార్చిన మహేష్ బాబు
Advertisement
Ads by CJ

మహేష్ బాబు చాన్నాళ్లుగా నార్మల్ లుక్ నే మెయింటింగ్ చేస్తున్నారు. సర్కారు వారి పాట సినిమాలో చాలా అందంగా లాంగ్ హెయిర్ తో కనిపించిన మహేష్ బాబు కొన్నాళ్లుగా ఒకే లుక్ లో కనిపిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు తన కూతురు సితార పుట్టిన రోజు వేడుకల్లో చాలా అందంగా కనిపించారు. రీసెంట్ గా మహేష్ బాబు మరోసారి ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వేశారు. గత నెలలో అమెరికా, యూరప్ దేశాలు తిరిగొచ్చిన మహేష్ ఫ్యామిలీ ఈసారి స్విజ్జర్లాండ్ ట్రిప్ కి వెళ్ళింది. కొడుకు గౌతమ్, సితార, భార్య నమ్రతలతో మహేష్ బాబు ఎంజాయ్ చేస్తున్నాడు. 

తాజాగా నమ్రత భర్త మహేష్ బాబు తో కలిసి రొమాంటిక్ గా వున్న ఫొటోస్ ని షేర్ చెయ్యగా.. ఆ పిక్ లో మహేష్ గెడ్డం లేకుండా స్టయిల్ గా అందంగానే కనిపించారు. కానీ ఈ రోజు నమ్రత షేర్ చేసిన పిక్ లో మహేష్ బాబు లుక్ చేంజ్ చేసారు. కొద్దిపాటి గెడ్డం పెంచిన మహేష్ హెయిర్ పక్కకి దువ్విన స్టయిల్ తో ఆయన ఫోన్ లో మాట్లాడుతున్న పిక్. ఎదురుగా సితార పాప ఉంది. కానీ మహేష్ కొత్త లుక్ చాలా బావుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చెయ్యగా.. ఈ లుక్ తోనే SSMB 28 లో మహేష్ కనిపిస్తే ఆ లుక్ అదిరిపోతోంది అంటూ ఆయన ఫాన్స్ కామెంట్స్ చేస్తూ మహేష్ కొత్త లుక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. 

Mahesh look change :

Mahesh babu new look goees viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ