Advertisementt

అవకాశాల ముందు అవెంత: రష్మిక

Tue 02nd Aug 2022 12:41 PM
rashmika mandanna,lucky heroine,movie offers,rashmika  అవకాశాల ముందు అవెంత: రష్మిక
Rashmika Mandanna about Movie offers అవకాశాల ముందు అవెంత: రష్మిక
Advertisement
Ads by CJ

తనపై వచ్చే రూమర్స్ ని కానీ, తన మీద వచ్చే పిచ్చి రాతలను కానీ పట్టించుకోను అంటున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. ప్రస్తుతం స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ లక్కీ గర్ల్.. త్వరలోనే సీత రామం మూవీ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మికాని.. మీ మీద వచ్చే పుకార్లపై మీకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అని అడిగితే.. సినిమాలు నాకు చాలా ఇచ్చాయి. సెలెబ్రిటీ హోదా, పేరు ప్రతిష్టలు, ఆడియన్స్, ఫాన్స్ ఇచ్చే ప్రేమ ఇలా సినిమాల వలన నేను చాలా పొందాను. ఇలాంటివన్నీ ఎంతో అదృష్టం ఉంటే తప్ప దక్కేవి కావు. 

నాకన్నా బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నటన పరంగా, గ్లామర్ పరంగా నాకన్నా బెస్ట్ ఉన్నవాళ్లు ఉన్నారు. కానీ వాళ్ళని కాదని నాకు అవకాశం ఇవ్వడం, ప్రత్యేకమే కాదు అదృష్టం కదండి అంటుంది. అందుకే మిగతా ఏ సమస్య వచ్చినా నాకు చిన్నదిగానే కనిపిస్తుంది. నాపై వచ్చే రూమర్స్ గురించి నేనెప్పుడూ ఆలోచించను. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడానికే నేను సినిమాల్లోకి వచ్చాను.. నా గురించి ఏ చిన్న విషయమైనా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అందుకే నేను వాటిని పట్టించుకోను అంటూ రష్మిక చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

Rashmika Mandanna about Movie offers:

Rashmika Mandanna opens up about offers

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ