Advertisementt

పాపం ఈ నిర్మాతకి వరసగా షాక్ లే

Tue 02nd Aug 2022 12:05 PM
raviteja,ramarao on duty,ramaro on duty disaster collections,sudhakar cherukuri  పాపం ఈ నిర్మాతకి వరసగా షాక్ లే
Unfortunately, this producer does not have a succession shock పాపం ఈ నిర్మాతకి వరసగా షాక్ లే
Advertisement
Ads by CJ

రీసెంట్ గా రవితేజ-శరత్ మండవ కాంబోలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ ప్రేక్షకులని ఎంటర్టైన్ చెయ్యలేక చేతులెత్తేసింది. రవితేజ సినిమాల్లో కనీస ఓపెనింగ్స్ రాని సినిమాగా రామారావు ఆన్ డ్యూటీ నిలిచింది అనడంలో సందేహమే లేదు. రెండో రోజు మరింత దారుణంగా ఉంది రవితేజ సినిమా పరిస్థితి. మరి 17 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన ఈ సినిమాకి 5 కోట్ల కలెక్షన్స్ కూడా వచ్చేలా కనిపించడం లేదు. ఈ సినిమా దెబ్బకి నిర్మాత సుధాకర్ కి గట్టి షాక్ తగిలింది అనే చెప్పాలి. 

ఆయన తెరకెక్కించిన పడి పడి లేచే మనసు, విరాట పర్వం, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాల కన్నా ఘోరంగా ఈ రామారావు ఆన్ డ్యూటీ కలెక్షన్స్ ఉన్నాయి. వరస ప్లాప్స్ తో ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఢీలా పడిపోయారని అంటున్నారు. కానీ రవితేజ మాత్రం సుధాకర్ కి భరోసా ఇచ్చాడని, ఈ మూవీ ప్లాప్ అవ్వడంతో పారితోషికం విషయంలో పట్టింపు లేకుండా నెక్స్ట్ మూవీ చేసి పెడతాననీ, బడ్జెట్ తక్కువలో సినిమా చేయడానికైనా తాను రెడీగానే ఉంటానని చెరుకూరి సుధాకర్ కి రవితేజ మాట ఇచ్చాడని తెలుస్తుంది. 

Unfortunately, this producer does not have a succession shock:

Raviteja ramarao on duty disaster collections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ