మెగాస్టార్ చిరంజీవి.. నిన్న ఆదివారం వరకు అక్కడ ముంబై లో చిరు - మోహన్ రాజా కలయికలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ షూటింగ్ లో బిజీగా వున్నారు. చిరు గాడ్ ఫాదర్ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే గాడ్ ఫాదర్ లో చిరు తో పాటుగా సల్మాన్ ని పెట్టి ప్రభుదేవా కొరియోగ్రఫీ లో ఓ సాంగ్ ప్లాన్ చేసి భారీ సెట్ లో ఆ సాంగ్ చిత్రీకరణ కోసం టీం ముంబైకి వెళ్ళింది. సల్మాన్ - చిరు ల సాంగ్ చిత్రీకరణ నిన్నటితో పూర్తయ్యింది. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
అటు గాడ్ ఫాదర్ స్పెషల్ సాంగ్ పూర్తి కావడం, అలాగే టాలీవుడ్ సినిమాల షూటింగ్స్ బంద్ అవడంతో మెగాస్టార్ ముంబై నుండి హైదరాబాద్ కి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మెగాస్టార్ చిరు వర్షం పడుతున్న టైం లో ఫ్లైట్ నుండి దిగి ఎయిర్ పోర్ట్ లో నడుచుకుంటూ వస్తున్న వీడియో అది. మరి మెగాస్టార్ చిరు హైదరాబాద్ కి రావడంతో నిర్మాతలు మెగాస్టార్ తో ఎమన్నా చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చిరు సాయం తీసుకుంటారేమో అనే అతృతతో చిన్న హీరోలు, చిన్న నిర్మాతలు ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.