Advertisementt

ఒకపక్క ఆనందం - మరోపక్క విషాదం

Mon 01st Aug 2022 08:45 PM
jr ntr,lakshmi pranathi,nandamuri family,balakrishna,umamaheswari  ఒకపక్క ఆనందం - మరోపక్క విషాదం
Happiness on one side - sadness on the other ఒకపక్క ఆనందం - మరోపక్క విషాదం
Advertisement
Ads by CJ

ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెద్దగా పబ్లిక్ లోకి రాలేదు. రీసెంట్ గా బింబిసారా ఈవెంట్ లో కనిపించిన ఎన్టీఆర్ ని చూసి ఫాన్స్ చాలా ఆనందపడిపోయారు. ఎన్టీఆర్.. కొరటాల మూవీ కోసం మేకోవర్ అవుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే ట్రిపుల్ ఆర్ విడుదలకు ముందు భార్య పిల్లలతో వెకేషన్స్ కి వెళ్లిన ఎన్టీఆర్ తన పెళ్లి రోజు ని హైదరాబాద్ లోనే తన ఫ్రెండ్, తన నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫ్యామిలీతో కలిసి జరుపుకున్నారు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఎన్టీఆర్ తన భార్య ప్రణతి తో ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇలాంటి క్షణాలు అంటూ కామెంట్ చేసారు. లక్ష్మి ప్రణతి - ఎన్టీఆర్ ఎదురెదురుగా ఓ బల్లపై కూర్చుని.. కాఫీ తాగుతూ సరదాగా మాట్లాడుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తున్న పిక్ అది. ఆ ఫోటో ఎన్టీఆర్ షేర్ చేసిన క్షణాల్లో వైరల్ గా మారిపోవడమే కాదు, నందమూరి, ఎన్టీఆర్ ఫాన్స్ అంతా ఈ జంటకి మా దిష్టే తగులుతుంది అనుకున్నారు. 

మరి ఇంత ఆనందాన్ని ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న కొద్దిసేపటికే నందమూరి ఫ్యామిలిలో జరగరాని ఘోరం జరిగిపోయింది. దానితో నందమూరి అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. సీనియర్ ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య నందమూరి కుటుంబాన్ని కుదిపేసింది. ఉమామహేశ్వరి మరణ వార్తతో నందమూరి ఫ్యామిలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అందుకే అన్నది ఒకవైపు ఆనందం ఆస్వాదించే లోపే మరోవైపు ఆ ఆనందం ఆవిరైపోయింది అని. 

Happiness on one side - sadness on the other:

Jr NTR enjoys a candid moment with wife Lakshmi Pranathi 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ