ఎన్టీఆర్ చిన్న కుమర్తె ఉమామహేశ్వరి ఈ రోజు సోమవారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకోవడం నందమూరి ఫ్యామిలీకి తీవ్ర వేదనని మిగిల్చింది. ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామామహేశ్వరి అనారోగ్య కారణాలతో ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆమె చిన్న కూతురు దీక్షత పోలీస్ లకి ఫిర్యాదు చెయ్యడం నందమూరి అభిమానులని కలిచి వేసింది. ఈరోజు మద్యాన్నం 12 గంటల సమయంలో తన రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్న ఉమామహేశ్వరి తన గదిలో ఫ్యాన్ కి చున్నీతో ఉరి వేసుకుని మరణించగా.. రెండు గంటలుగా ఆమె బయటికి రాకపోవడంతో ఆమె కూతురు దీక్షిత పోలీస్ లకి ఫిర్యాదు చెయ్యడంతో వారు ఇంటికి వచ్చి తలుపులు పగలగొట్టగా ఆమె ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది అని పోలీస్ లు చెబుతున్నారు.
అమ్మ ఆత్మహాత్య చేసుకున్నప్పుడు తాము నలుగురం ఇంట్లోనే ఉన్నామని దీక్షిత పోలీస్ లకి చెప్పింది, మానసిక ఒత్తిడి, అనారోగ్యం కారణాల వలనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా దీక్షిత పోలీస్ లకి తెలియజేసింది. ఆమె మరణం తర్వాత ఫ్యామిలీ మెంబెర్స్ ఆమె కళ్ళని ఎల్ వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కి దానం చేసారు. తర్వాత ఉస్మానియా ఆసుపత్రిలో ఉమా మహేశ్వరి కి పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకి అప్పగించగా.. ఉమామహేశ్వరి పెద్ద కూతురు విశాల అమెరికాలో ఉండడంతో ఉమామహేశ్వరి అంత్యక్రియలని బుధవారం జరిపించనున్నారని తెలుస్తుంది. ఇక ఉమామహేశ్వరి పోస్ట్ మార్టం రిపోర్ట్ రెండు రోజుల్లో ఉస్మానియా వైద్యులు పోలీస్ లకి అందజేస్తారని తెలుస్తుంది.