విడాకుల విషయంలో సమంత బాగా ఎక్సపోజ్ అవ్వగా.. నాగ చైతన్య కామ్ గా ఉన్నాడు. నాగ చైతన్య ఎక్కువగా లో ప్రొఫైల్ మెయింటింగ్ చేస్తాడన్న విషయం తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉన్న సమంత-చైతు లు విడిపోవడం చాలామందికి నచ్చలేదు. అయితే విడాకుల తర్వాత సోషల్ మీడియాలో సమంత చాలా నెగెటివిటీ ఫేస్ చేసింది. చైతూని సపోర్ట్ చేసిన వారు సమంత ని బాధపెట్టారు. దానితో రీసెంట్ గా సమంత కాఫీ విత్ కరణ్ షో, నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన ఆ షోలో సమంత చైతు తో విడాకుల విషయంపై, అలాగే తాను భరణం తీసుకుంటున్నట్లుగా జరిగిన ప్రచారం పై స్ట్రాంగ్ గా కౌంటర్ వేసింది.
మీడియా నుండి ఇప్పటివరకు చైతు కి ప్రశ్నలు ఎదురైనా సమాధానాలు దాటవేశారు. కానీ నాగ చైతన్య లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ లో భాగంగా నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతు కి ఈ డివోర్స్ పై ప్రశ్న ఎదురయ్యింది. దానితో చైతు కాస్త కోపంగానే... అందరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. నా వ్యక్తిగత విషయాలు అందరూ మాట్లాడుకోవడం అసహనానికి గురి చేస్తుంది. సమంతతో డివోర్స్ పై ఇప్పటికే ప్రకటన చేశాం. విడాకులకు గల కారణం ఏమిటో ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్రస్తుతం ఎవరి వ్యక్తిగత జీవితాన్ని వారు జీవిస్తున్నాం. సమంత దారి సమంతదే.. నా దారి నాదే. ఇంతకంటే నా లైఫ్ గురించి, విడాకుల గురించి చెప్పాల్సిందేమి లేదు అంటూ ఘాటూగా స్పందించాడు.
అంతేకాకుండా సోషల్ మీడియాలో తనపై వస్తున్న రూమర్స్‌ని పట్టించుకోనని, మొదట్లో ఆలోచించేవాడినని, కానీ ఇప్పుడు ఆ రూమర్స్ గురించి అంతగా ఆలోచించడం లేదని చైతు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.