Advertisementt

కూతురిని అలా పరిచయం చేసిన ప్రణీత

Mon 01st Aug 2022 10:27 AM
praneetha,arna first pic,praneetha daughter arna  కూతురిని అలా పరిచయం చేసిన ప్రణీత
Praneetha daughter Arna first pic కూతురిని అలా పరిచయం చేసిన ప్రణీత
Advertisement
Ads by CJ

హీరోయిన్ ప్రణీత కరోనా లాక్ డౌన్ లో వివాహం చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టింది. హీరోయిన్ గా పలు సినిమాలు చేసినా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకోలేకపోయిన ప్రణీత బాలీవుడ్ లోను నటించింది. అలాగే లాక్ డౌన్ టైం లో తన ఆపన్న హస్తంతో ఎంతోమందికి సాయం చేసిన ప్రణీత ఎవరికీ చిన్న క్లూ కూడా ఇవ్వకుండానే పెళ్లి చేసుకుని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి షాకిచ్చింది. తర్వాత తరచూ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉన్న ప్రణీత.. భర్త బర్త్ డే కి స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చింది. 

ఆ రోజే తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేసింది. తర్వాత బేబీ బంప్ ఫోటో షూట్స్ తోనూ సోషల్ మీడియాలో హడావిడి చేసిన ప్రణీత తర్వాత తనకు కూతురు పుట్టినట్టుగా ప్రకటించింది. ఇక రీసెంట్ గా భర్త పాద పూజ చేస్తూ కనిపించింది. ఇప్పుడు తన కూతురు పేరుని, పాప ని ఎంతో బ్యూటిఫుల్ గా పరిచయం చేసింది. కూతురు పేరు ఆర్న అని, ఆ పాపకి స్పెషల్ ఫోటో షూట్ చేయించి ఆ ఫస్ట్ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.  

Praneetha daughter Arna first pic:

Praneetha daughter Arna first pic goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ