Advertisementt

దసరా సినిమాలపై భారీ ఎఫెక్ట్

Mon 01st Aug 2022 10:09 AM
tollywood,august 1st,dasara festival,dasara movies  దసరా సినిమాలపై భారీ ఎఫెక్ట్
Huge effect on Dussehra movies దసరా సినిమాలపై భారీ ఎఫెక్ట్
Advertisement
Ads by CJ

దసరా రిలీజ్ అంటూ పెద్ద సినిమాలు దసరా పండగకి కచ్చిఫ్ వేసేసాయి. చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ఘోస్ట్ ఇంకా కొన్ని సినిమాలు దసరా టార్గెట్ పెట్టుకుని సినిమా షూటింగ్స్ చేస్తున్నాయి. కానీ దసరా బరిలో నిలవబోయే సినిమాలకి ఇప్పుడొక గండం వెంటాడుతుంది. అదేమిటంటే.. ఈ రోజు ఆగస్టు 1 నుండి టాలీవుడ్ లో సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. టాలీవుడ్ సమస్యలను తీర్చేందుకు ప్రస్తుతం కొన్ని రోజులపాటు సినిమా షూటింగ్స్ ఆపాలంటూ నిర్మాతల మండలి, తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్ణయించడంతో సినిమా షూటింగ్స్ అన్ని ఎక్కడివక్కడే ఆగిపోయాయి. 

అందులో పాన్ ఇండియా మూవీస్, బడా బడ్జెట్ మూవీస్, చిన్న సినిమాలు ఇలా ప్రతి ఒక్క షూటింగ్ నిలిచిపోయింది. మరి సంక్రాంతి, సమ్మర్ రిలీజ్ సినిమాల షూటింగ్స్ కి కొద్ది రోజులు గ్యాప్ వచ్చినా పర్లేదు కానీ.. దసరా కి రాబోయే చిత్రాలకు ఇలా షూటింగ్ ఆగడం ఇబ్బందే. దసరా చిత్రాల షూటింగ్స్ అన్నీ చివరి దశలో ఉన్నాయి. అయినప్పటికీ షూటింగ్స్ చెయ్యకూడదనే నిర్ణయంతో షూటింగ్స్ నిలిచిపోవడంతో ఆ ఎఫెక్ట్ దసరా, దీపావళి సినిమాలపై పడుతుంది అంటున్నారు. మరి ఈ షూటింగ్స్ బంద్  ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలి. 

Huge effect on Dussehra movies:

Tollywood Shootings Bandh In August 1st

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ