Advertisementt

నిఖిల్ కామెంట్స్ ఎవరిపై..

Sun 31st Jul 2022 10:03 PM
hero nikhil,karthikeya 2,tollywood,nepotism  నిఖిల్ కామెంట్స్ ఎవరిపై..
Nikhil Sensational Comments Goes Viral నిఖిల్ కామెంట్స్ ఎవరిపై..
Advertisement
Ads by CJ

హీరో నిఖిల్ తన కార్తికేయ 2 ప్రమోషన్స్ లో చాలా బిజీగా కనిపిస్తున్నాడు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, దర్శకుడు చందు మొండేటితో కలిసి చేస్తున్న ప్రమోషన్స్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. బుల్లితెర మీద కూడా కార్తికేయ2 ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే తాజాగా నిఖిల్ కార్తికేయ2 ప్రమోషన్స్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారడమే కాదు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. కార్తికేయ 2 విడుదల తేదీలు చాలా మార్చుకున్నది. అయితే కార్తికేయ 2 విడుదల విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని, ఒకానొక సమయంలో ఏడ్చాను అంటూ నిఖిల్ చేసిన కామెంట్స్ హాట్ హాట్ గా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేని హీరోల సినిమాలు పక్కకి నెట్టేసినట్టుగా, నా సినిమా కార్తికేయకి జరిగింది. కార్తికేయ 2 ఆగష్టు 12 రిలీజ్ అని ప్రకటించే ఐదు రోజుల ముందు ఆ డేట్ కి కార్తికేయ 2 రిలీజ్ చెయ్యొద్దు అని చెప్పారు. మీరు కార్తికేయ 2 ని అక్టోబర్ కి కానీ, నవంబర్ కి కానీ రిలీజ్ పెట్టుకోండి. ఇప్పుడప్పుడే మీ సినిమా రిలీజ్ అవ్వదు, మీకు థియేటర్స్ దొరకవు, ఇవ్వము అనే స్టేజ్ వరకు వెళ్ళింది. అప్పుడు నేను చల ఏడ్చాను. మాములుగా నేను స్ట్రాంగ్ పర్సన్ ని. హ్యాపీడేస్ నుండి సినిమాలు చేసినా.. ఇంతవరకు మీకు థియేటర్స్ దొరకవు అనే మాట వినిపించలేదు. అందుకే నువ్వెంత కష్టపడినా.. సినిమా రిలీజ్ అవ్వదు అనేసరికి ఏడుపు వచ్చేసింది అని, కానీ కార్తికేయ నిర్మాతలు విశ్వ ప్రసాద్‌, అభిషేక్ సపోర్ట్‌తో కావాలనే ఆగష్టు 12 కి వస్తున్నామంటూ నిఖిల్ ఎమోషనల్ అయిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

అయితే నిఖిల్ చేసిన కామెంట్స్ ఎవరిపై అంటూ ఇప్పుడు అందరూ తెగ చర్చించేసుకుంటున్నారు.

Nikhil Sensational Comments Goes Viral:

Hero Nikhil Siddharth Sensational Comments On Nepotism

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ