పవన్ కళ్యాణ్ ఈమధ్యన వైరల్ ఫీవర్ తో బాధపడుతూ కొన్నాళ్లుగా రెస్ట్ లోనే ఉంటున్నారు. అటు రాజకీయాలు, ఇటు సినిమా షూటింగ్స్ ని పక్కనబెట్టేశారు. పవన్ సిక్ అయ్యిం వారం కాదు పది రోజులు గడిచిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ హెల్త్ స్టేటస్ మాత్రం తెలియడం లేదు. పవన్ కళ్యాణ్ ఫీవర్ తో పూర్తిగా కోలుకున్నారా? ఇంకా ఫీవర్ తో బాధపడుతున్నారా? అనే విషయక తెలియక ఫాన్స్ ఆందోళన పడుతున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గనక కోలుకుంటే ఆయన ఏపీ లో వచ్చిన వరదల విషయంలో ప్రజలని కలిసేవారు. కానీ పవన్ కళ్యాణ్ చప్పుడు చెయ్యడం లేదు. ఇటు సినిమా షూటింగ్స్ లోను పాల్గొన్న దాఖలాలు లేవు.
దానితో అసలు పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారో అంటూ ఫాన్స్ కూడా కంగారు పడుతున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని గండిపేట ఏరియా లో ఓ కాస్ట్లీ ఫామ్ హౌస్ కట్టించుకుంటున్నారు, ఇకపై పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ అన్ని ఆ ఫామ్ హౌస్ నుండే జరుగుతాయి అంటూ ప్రచారం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు, లేదు రాజకీయాల్లో ఆక్టివ్ అవుతారు అని తెలిస్తేనే కానీ ఫాన్స్ ఊరుకునేలా లేరు.