రేపు ఆగష్టు 1 నుండి టాలీవుడ్ ఇండస్ట్రీ షూటింగ్స్ అన్నీ ఆగిపోనున్నాయి. ప్రొడ్యూసర్ గిల్డ్ పిలుపు మేరకు ఫిలిం ఛాంబర్ కూడా షూటింగ్స్ బంద్ కి మద్దతు తెలపడంతో రేపటి నుండి టాలీవుడ్ లో షూటింగ్స్ కార్యకలాపాలు అన్నీ ఆగిపోనున్నాయి. దానితో సెట్స్ మీదున్న పెద్ద హీరోలు, స్టార్ హీరోలు, చిన్న హీరోలు ఇలా ఏ సినిమా షూటింగ్ అయినా బంద్ కావాల్సిందే. హీరోలు, నటులు రెమ్యునరేషన్స్ తగ్గించుకుంటే.. బడ్జెట్ కంట్రోల్ అయ్యి నిర్మాతలు సేఫ్ అవుతారంటూ షూటింగ్స్ ని ఎక్కడికక్కడే ఆపేస్తున్నారు నిర్మాతలు. మరి ఈ లెక్కన చిరు గాడ్ ఫాదర్, భోళా శంకర్, మెగా 154 షూటింగ్స్ తో పాటుగా, బాలకృష్ణ NBK107, నాగార్జున ఘోస్ట్, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ సలార్, ప్రాజెక్ట్ K , అలాగే రామ్ చరణ్ RC15 ఇలా అన్ని ఆగిపోనున్నాయి.
ఆగష్టు నెలలో మొదలు కావల్సిన అల్లు అర్జు పుష్ప, మహేష్ బాబు SSMB28 చిత్రాల షూటింగ్స్ మొదలు కావు. ఇంకా ఎన్టీఆర్ - కొరటాల మూవీ కూడా ఏమవుంతుందో అని ఫాన్స్ కంగారు పడుతున్నారు. షూటింగ్స్ చివరి దశలో ఉన్న సినిమాలు కూడా ఆగిపోనున్నాయి. కరోనా తో పరిస్థితులు సద్దుమణిగి.. ఇప్పుడే టాలీవుడ్ సమస్యల నుండి బయటపడుతుంది అంటే.. ఇప్పుడు ఈ సమస్య రావడంతో హీరోల ఫాన్స్ కంగారు పడుతున్నారు. మరి టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి ఎప్పుడు చర్చించి నిర్ణయం తీసుకుంటారో? ఈ షూటింగ్స్ బంద్ ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలి.