Advertisementt

రజినీ పాదాలకు నమస్కారం చేసిన మాధవన్

Sun 31st Jul 2022 03:23 PM
rajinikanth,madhavan,nambi narayanan,rocketry-the nambi effect  రజినీ పాదాలకు నమస్కారం చేసిన మాధవన్
Rajinikanth felicitates Madhavan and Nambi Narayanan రజినీ పాదాలకు నమస్కారం చేసిన మాధవన్
Advertisement
Ads by CJ

మాధవన్ స్వయంగా డైరెక్ట్ చేసి నటించిన నంబి నారాయణన్ బయోపిక్ రాకెటరీ: ద నంబీ ఎఫెక్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు, విమర్శకుల ప్రశంశలు అందుకోవడంతో నటుడు మాధవన్ చాలా హుషారుగా ఉన్నారు. రాకెటరీ: ద నంబీ ఎఫెక్ట్ చూసిన ప్రముఖులు మాధవన్ పెరఫార్మెన్స్ ని ప్రశంసిస్తున్నారు. రజినీకాంత్ కూడా రాకెటరీ చూసి మాధవన్ ని పొగిడేశారు. అయితే తాజాగా మాధవన్ రజినీకాంత్ ని ఆయన నివాసంలో కలిశారు.

తనను మీట్ అయిన మాధవన్ కి, నంబి నారాయణన్ కి శాలువా కప్పి రజినీకాంత్ సత్కరించగా.. మాధవన్ గౌరవరం గా రజినీకాంత్ పాదాలకు నమస్కరించడం హైలెట్ అయ్యింది. తర్వాత మాధవన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. నంబి నారాయణన్ సమక్షంలో ఇండస్ట్రీ అనగానే కనిపించే ఒకే ఒక్కడు, అద్భుతమైన నటుడి నుంచి ఆశీర్వచనాలు తీసుకోవడం.. నిజంగా ఈ క్షణం ఎప్పటికి గుర్తుండిపోతుంది. రాకెటరీ గురించి మీ మంచి మాటలకు, అభిమానానికి ధన్యవాదాలు రజనీకాంత్ సర్. మీ ప్రోత్సాహం మాకు ఎంతో బలాన్నిచ్చింది. మేము మమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం అంటూ ట్వీట్ చేసాడు. 

 

Rajinikanth felicitates Madhavan and Nambi Narayanan:

Rajini thrills Rocketry makers

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ