సౌత్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్స్ అవడం, ఆ సినిమాలు నార్త్ లో కోట్లు కొల్లగొట్టేయ్యడం, బాలీవుడ్ ఆడియన్స్ కూడా సౌత్ మూవీస్ కి బ్రహ్మరధం పట్టడం.. బాలీవుడ్ సినిమాలు సౌత్ సినిమాల ముందు చిన్నబోవడంతో ఆల్మోస్ట్ బాలీవుడ్ పనైపోయింది అంటూ సోషల్ మీడియాలో తీవ్రంగా వార్తలు రేజ్ అవుతున్నాయి. ఎంతగా హిందీ హీరోలు డిఫెండ్ చేస్తున్నా సౌత్ సినిమాల ముందు హిందీ సినిమాలు తేలిపోతూనే ఉన్నాయి. అయితే బాలీవుడ్ బడా కింగ్ మేకర్ కరణ్ జోహార్ ఎవరు బాలీవుడ్ పనైపోయింది అన్నారు అంటూ ఫైర్ అవుతున్నారు. చెత్తవాగుడు వాడుతున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయి.
గంగూబాయ్ కతియావాడి, భూల్ భులాయా 2 రెండూ మంచి హిట్ కొట్టాయి. అలాగే రీసెంట్ గా జుగ్ జుగ్ జియో మూవీ కూడా బాగానే ఆడింది. కంటెంట్ లేని సినిమాలు మాత్రం ప్లాప్ అవుతాయి. మేకర్స్ ని దెబ్బకొడతాయి. అయినా మనదగ్గర ఇప్పుడు లైన్ లో చాలా సినిమాలు ఉన్నాయి. లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్, బ్రహ్మాస్త్ర, సర్కార్ లాంటి సినిమాలు రాబోతున్నాయి. ఈ సినిమాల కోసం మనం ఎదురుచూడాలి. కానీ థియేటర్స్ కి ఆడియన్స్ ని రప్పించాలంటే మాములు విషయం కాదు. మంచి ప్రమోషన్స్ ఉండాలి, అవి పక్కాగా జరగాలి, పేరు ప్రతిష్టలకు అనుగుణంగా బ్రతుకుతున్నాం. ఒక్కోసారి ఒత్తిడి అనిపించినా ఛాలెంజ్ లు స్వీకరించడం నాకు ఇష్టం అంటూ కరణ్ జోహార్ హిందీ సినిమాల సక్సెస్ పై స్పందించారు.