జబర్దస్త్ నుండి అనసూయ తప్పుకోవడంతో కొత్తగా రాబోయే యాంకర్ మీద అటు కమెడియన్స్ లోను, ఇటు కామెడీ ప్రియులలోను, అలాగే బుల్లితెర ప్రేక్షకుల్లోనూ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది, ఆసక్తిని కలిగిస్తుంది. అనసూయ వెళ్లిపోయే ఎపిసోడ్ ప్రోమోలోనే కొత్త యాంకర్ రివీల్ అవ్వుద్ది అనుకుంటే.. అప్పుడు కొత్త యాంకర్ వచ్చినా.. కమెడియన్స్ చొంగ కార్చుకున్నట్టుగా, ఒకరి మీద ఒకరు ఆ కొత్త యాంకర్ ని చూడడానికి పోటీ పడినట్టుగా చూపించారు కానీ.. ఆ యాంకర్ ఎవరివో అనేది రివీల్ చెయ్యలేదు. అయితే ఆ ఎపిసోడ్ ప్రోమోని యూట్యూబ్ లో వదిలారు. హమ్మ ఆ యాంకర్ ఎవరో అనుకుని అందరూ ఆత్రంగా ప్రోమోని ఓపెన్ చెయ్యగా.. నెక్స్ట్ వీక్ కొత్తగా సంగీత జేడ్జ్ గాను, ఇంద్రజ ఎప్పటిలాగే కనిపించే జేడ్జ్ గాను, రాబోయే స్కిట్స్ ని ప్రోమోలో వదిలారు.
రాఘవ, ఫైమా, నూకరాజు ఇలా అందరి స్కిట్స్ ని కొద్ది కొద్దిగా ప్రమోగా కట్ చేసారు ఓకె. కానీ యాంకర్ కోసం ప్రోమో చివరి వరకు వెయిట్ చేసినా.. ఆ యాంకర్ ని మరోసారి దాచేసి గురువారం వరకు సస్పెన్స్ లో పెట్టేసారు.. ప్రమోలో ఆమె ముఖాన్ని, ఆ కొత్త యాంకర్ ఎవరు అనే విషయాన్ని దాచేసారు. కనీసం చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. మళ్ళీ కమెడియన్స్ నేను ముందు చూస్తా అంటే నేను ముందు చూస్తా అనేదాన్ని హైలెట్ చేసి చూపించారు.. అనసూయని రీ ప్లేస్ చేసే యాంకర్ ని మాత్రం చూపించలేదు.