ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా అప్ డేట్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ట్రిపుల్ ఆర్ వచ్చి నాలుగు నెలలు గడిచిపోయాయి. కానీ ఎన్టీఆర్ కొత్త సినిమా ఊసు లేదు. కొరటాల తో ఎన్టీఆర్ చెయ్యాల్సిన సినిమా అప్ డేట్ ఇవ్వకుండా మేకర్స్ నాన్చుతూనే ఉన్నారు. కానీ NTR30 పట్టాలెక్కడానికి గల అడ్డంకులు దాటడం లేదు. గత రాత్రి బింబిసారా ఈవెంట్ లో ఎన్టీఆర్ కొరటాల మూవీ పై ఎమన్నా మాట్లాడతారేమో అని ఆశగా చూసిన ఫాన్స్ కి నిరాశే ఎదురైంది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ కొరటాల మూవీ విషయంలో డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అని, కొరటాలని ఆచార్య సమస్యలు చుట్టుముట్టడంతో.. ఆయనతో సినిమా చెయ్యాలా.. వద్దా అని డైలమాలో ఉన్నాడని, పోనీ ప్రశాంత్ నీల్ తో NTR31 మొదలు పెడదామన్నా.. ఆయన ప్రస్తుతం ఖాళీగా లేకపోవడంతో.. ఎన్టీఆర్ కి ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు అని, అటు బుచ్చిబాబు తో కమిట్ అయిన మూవీ ని పట్టాలెక్కిద్దామంటే.. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా మూవీ చేసి ఉన్నాను, అంతకు మించి అనేలా నెక్స్ట్ ఉండాలి కానీ.. అల్లాటప్పా మూవీలా ఉండకూడదు.. అంటూ ఎన్టీఆర్ టోటల్ గా నెక్స్ట్ మూవీ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నట్లుగా తెలుస్తుంది.