Advertisementt

ఫాన్స్ ని డిస్పాయింట్ చేసిన ఎన్టీఆర్

Sat 30th Jul 2022 10:38 AM
ntr,ntr fans,ntr30 look,koratala - ntr movie,kalyan ram,bimbisara  ఫాన్స్ ని డిస్పాయింట్ చేసిన ఎన్టీఆర్
NTR disappointed the fans ఫాన్స్ ని డిస్పాయింట్ చేసిన ఎన్టీఆర్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తో కొద్దిగా బరువు పెరిగి కొమరం భీమ్ పాత్రలో అద్భుతంగా మేకోవర్ అయ్యారు. ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ గెటప్, కొమరం భీముడా సాంగ్ లో ఎన్టీఆర్ పెరఫార్మెన్స్ కి ఆయన ఫాన్స్ మాత్రమే కాదు, పాన్ ఇండియా ప్రేక్షకులు విజిల్స్ వేశారు. అయితే ఎన్టీఆర్ కొరటాల తో చెయ్యబోయే NTR30 కోసం కాస్త వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లో ఉన్నారు. దాదాపుగా ఏడెనిమిది కేజీల బరువు తగ్గేందుకు జిమ్ లో కసరత్తులు మొదలు పెట్టారు.. అంటూ ప్రచారం జరుగుతుంది. NTR30 పాన్ ఇండియా మూవీ అవడం వలన ఎన్టీఆర్ కి ట్రిపుల్ ఆర్ తో వచ్చిన ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాజెక్ట్ విషయంలో కొరటాల చాలా శ్రద్ద పెడుతున్నట్టుగా కళ్యాణ్ రామ్ రివీల్ చేసారు.

అయితే ఇప్పుడు అందరూ ఎన్టీఆర్ బరువు తగ్గుతున్నాడనే విషయాన్నే ముచ్చటించుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్ బరువు అయితే తగ్గడం అటుంచి వెయిట్ పెరిగినట్టుగా కనిపిస్తుంది ఆయన రీసెంట్ లుక్. ఎన్టీఆర్ తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు. ఎన్టీఆర్ ఎప్పటినుండో ఫాన్స్ కి కనిపించకుండా ఉన్నారు. అందుకే ఫాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు ఎన్టీఆర్ కొత్త లుక్ చూడడానికి. కానీ ఎన్టీఆర్ ఆ ఈవెంట్ లో కాస్త బరువుగా, మొహం అయితే మరింత లావుగా కనిపించడంతో ఫాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. ఎన్టీఆర్ స్లిమ్ గా కనిపిస్తారు అనుకుంటే వెయిట్ పెరిగి బరువుగా కనిపిస్తున్నారు అంటూ డల్ మోడ్ లోకి వెళుతున్నారు.

NTR disappointed the fans:

Fans Disappointed over NTR look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ