మెగాస్టార్ చిరు తో బాబీ డైరెక్ట్ చేస్తున్న వాల్తేర్ వీరయ్య సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది. శృతి హాసన్ ఈ ప్రాజెక్ట్ లోకి రాకముందు చిరు తో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా జోడి కడుతుంది, బాబీ సోనాక్షిని సంప్రదిస్తున్నాడు అంటూ ప్రచారం జరిగింది. కానీ ఫైనల్ గా Mega154 ప్రాజెక్ట్ లోకి శృతి హాసన్ ఎంట్రీ ఇచ్చింది. అది కూడా శృతి హాసన్ బాలకృష్ణ సినిమా NBK107 ఒప్పుకున్నాకే.. చిరు సినిమా కి సైన్ చేసింది.
అయితే ఇప్పుడు బాలయ్య తో సోనాక్షి సిన్హా రొమాన్స్ అంటున్నారు. అది కూడా అనిల్ రావిపూడి తో బాలకృష్ణ చెయ్యబోయే NBK108 కోసం అనిల్ రావిపూడి సోనాక్షి ని తీసుకువస్తున్నాడని, ప్రస్తుతం సోనాక్షితో చర్చలు జరుపుతున్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియా లో స్ప్రెడ్ అయ్యింది. మరి NBK107 లో సోనాక్షి నిజంగా నటిస్తుందో.. లేదంటే చిరు సినిమాలాగా అవుతుందో చూడాలి. కాకపోతే సీనియర్ హీరోల విషయంలో ఈ హీరోయిన్స్ ని సెట్ చెయ్యడానికి దర్శకులు చాలా సమస్యలు ఎదుర్కుంటున్నారు.