జబర్దస్త్ లో అనసూయ అందాలను మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ని పోగొట్టడానికి మల్లెమాల యాజమాన్యం గట్టిగానే ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది. జబర్దస్త్ కి అనసూయ, ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మీ గౌతమ్ అందాలు ప్లస్ అయ్యాయి. కామెడీ కన్నా వీరి అందాల ఆరబోతతోనే జబర్దస్త్ షోస్ హైలెట్ అయ్యాయి. టీఆర్పీ తెచ్చుకున్నాయి. కానీ ఈమధ్యన జబర్దస్త్ కామెడీ షో మొత్తం ఎమోషన్ ని క్యారీ చేస్తుంది. కారణం టాప్ కమెడియన్స్ జబర్దస్త్ ని వీడడమే. ఆది, సుధీర్ లాంటి వారు వెళ్లిపోవడంతో టీఆర్పీ తగ్గింది. దానితో అనసూయ కూడా జబర్దస్త్ నుండి తప్పుకోవడానికి రెడీ అయ్యింది.
అనసూయ వెళ్ళిపోతే ఆమె ప్లేస్ లో వచ్చే కొత్త యాంకర్ ఎవరో అంటూ రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇక ఈ వారంతో అనసూయ జబర్దస్త్ కి ఎండ్ కార్డ్ వెయ్యడంతో వచ్చే వారం రాబోయే కొత్త యాంకర్ పై బుల్లితెర ప్రేక్షకుల్లో యమ ఆత్రుత మొదలయ్యింది. మరి ఆ కొత్త యాంకర్ ఎవరో అనేది వచ్చే ఎపిసోడ్ ప్రోమోలో రివీల్ చెయ్యకుండా కేవలం నాజూకైన చేతులని చూపిస్తూ క్యూరియాసిటీ పెంచగా.. జబర్దస్త్ కమెడియన్స్ మాత్రం చొంగ కారుస్తూ నేను ముందు చూస్తా అంటే నేను ముందు చూస్తా, నేను సీనియర్ ని అంటే నేను సీనియర్ ని అంటూ ఒకరి మీద ఒకరు పోటీపడిన ప్రోమో వైరల్ అవగా.. ఆ కొత్త యాంకర్ పై ఆత్రుత మరింతగా పెరిగిపోయింది.