అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప లుక్‌లోనే ఉన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయ్యాక పార్ట్ 2 కోసం అల్లు అర్జున్ పుష్ప రాజ్ లుక్‌లోనే ఉండిపోయారు. అదే లుక్‌ని కంటిన్యూ చేస్తూ పబ్లిక్‌లోనూ తిరుగుతున్నారు. ఫ్యామిలీతో వెకేషన్స్‌కి వెళుతున్నారు. పుష్ప 2 ఇదిగో మొదలవుతుంది, అదిగో మొదలవుతుంది అనడమే కానీ పుష్ప 2 షూటింగ్ మొదలు పెట్టడం లేదు. ఈలోపు అల్లు అర్జున్ పుష్ప లుక్‌తో రెండు యాడ్స్ షూట్స్‌లో పాల్గొంటున్నారు. రీసెంట్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ యాడ్ షూట్‌లో కనిపించారు. ఆ సమయంలో పుష్ప లుక్‌లోనే స్టైలిష్ అవతార్‌లో అల్లు అర్జున్ కనిపించారు. ఆ యాడ్ ఏమిటి అనేది తెలియాల్సి ఉంది.
ఇక మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ - అల్లు అర్జున్ మరో యాడ్ షూట్ చేశారు. గురువారం అల్లు అర్జున్ - హరీష్ శంకర్‌ల యాడ్ షూట్ జరిగింది. ఆ యాడ్ షూట్‌లోనూ అల్లు అర్జున్ పుష్ప లుక్‌లోనే మోడ్రన్ అవతారంలో కనిపించారు. ఆస్ట్రల్ పైప్స్ యాడ్ కోసం హరీష్‌తో అల్లు అర్జున్ వర్క్ చేశారు. దానితో ఫ్యాన్స్ అల్లు అర్జున్ పుష్ప రాజ్ లుక్‌తోనే యాడ్స్ చేసేస్తున్నారా.. అని మాట్లాడుకుంటున్నారు. మరి పుష్ప 2 లేట్ అయితే ఏమిటి.. ఇలా మధ్యలో యాడ్ షూట్స్‌తో అల్లు అర్జున్ బాగానే హడావిడి చేస్తున్నారన్నది మాత్రం నిజం.