Advertisementt

రష్మికకు.. ఆ కల నెరవేరిందట!

Mon 08th Aug 2022 10:20 AM
rashmika mandanna,dream,pushpa,rashmika mandanna heroine,vijay,pan india,bollywood  రష్మికకు.. ఆ కల నెరవేరిందట!
Rashmika Mandanna calls Her dream come true రష్మికకు.. ఆ కల నెరవేరిందట!
Advertisement
Ads by CJ

రష్మిక మందన్న మోస్ట్ లక్కీయస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న గ్లామర్ డాల్. ఈ భాషా లేదు, ఆ భాషా లేదు.. అన్ని భాషల్లోనూ రష్మిక పేరు తెగ వినిపించేస్తుంది. తెలుగులో ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్‌లో తానేమిటో ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌లో పాగా వేయడానికి రెడీ అయ్యింది. అక్కడ అమితాబచ్చన్, సిద్దార్థ్ మల్హోత్రా, రణబీర్ కపూర్ లాంటి స్టార్స్‌తో నటిస్తున్న రష్మికకి ఓ కల ఇప్పటికి నెరవేరింది. అదేమిటంటే.. తమిళ స్టార్ హీరో విజయ్‌తో నటించాలనే కోరిక మాత్రమే కాదు, కల కూడా అని.. ఎప్పటి నుంచో అనుకుంటున్న ఓ కల ఈ విధంగా తీరింది అని చెబుతుంది.

 

తాను ఎంతమంది‌తో నటించినా, అన్ని భాషల్లో కలిపి విడుదలయ్యే సినిమా ద్వారా ఇండియన్ హీరోయిన్ అనిపించుకోవాలని ఉండేది అని, అది ‘పుష్ప’ సినిమా చేయడంతో ఆ కోరిక తీరినట్లుగా చెప్పిన రష్మిక..  గుడ్‌ బై చిత్ర షూటింగ్‌ సమయంలో అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి పుట్టినరోజు జరుపుకోవడం ఎప్పటికి మరిచిపోలేను అని, ఇంతకంటే ఇంకేం కావాలి నాకు అని చెప్పుకొస్తుంది. ప్రస్తుతం రష్మిక మలయాళం, తెలుగు, తమిళంలో తెరకెక్కిన ‘సీతా రామం’ ప్రమోషన్స్‌లో బిజీగా వుంది.

Rashmika Mandanna calls Her dream come true:

Rashmika Mandanna about Her Dreams

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ