పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం యమా జోరుగా షూటింగ్స్ చేస్తున్నారు. ఎప్పుడూ నెమ్మదిగా షూటింగ్స్ చేసే ప్రభాస్ ఈసారి జోరు కంటిన్యూ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం షూటింగ్స్ చేస్తున్న రెండు ప్రాజెక్ట్స్ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడంతో ప్రభాస్ ఫాన్స్ క్రేజీగా ఉన్నారు. ప్రాజెక్ట్ K, సలార్ రెండు డిఫరెంట్ జోనర్స్. అయినా ప్రభాస్ సలార్ షూటింగ్ తో పాటుగా ప్రాజెక్ట్ K షూటింగ్ అంటూ హడావిడిగా చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ దుల్కర్ సల్మాన్ నటించిన సీత రామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. కారణం సీతారామం నిర్మాతలు, ప్రాజెక్ట్ K నిర్మాతలు ఒక్కరే కావడంతో ప్రభాస్ ఆ ఈవెంట్ కి తప్పకుండా వస్తారని ప్రభాస్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.
అయితే ఇప్పుడు సీత రామం నిర్మాత అశ్విని దత్ ప్రభాస్ సీత రామం ఈవెంట్ కి రావడం లేదు. ఆయన చిన్న సర్జరీ కోసం విదేశాలకు వెళుతున్నారని చెప్పగానే.. ప్రభాస్ ఫాన్స్ ప్రభాస్ కి ఏమైంది అంటూ ఆందోళన పడుతున్నారు. ప్రభాస్ చేయించుకునేది నీ సర్జరీ అని, ఆందోళన అవసరం లేదు అని, కేవలం అది చిన్న సర్జరీ మాత్రమే అని తెలుస్తుంది. ఇక అశ్విని దత్ ప్రభాస్ ప్రాజెక్ట్ K విడుదలపై ఇచ్చిన అప్ డేట్ ఫాన్స్ కూల్ అవుతున్నారు.