Advertisementt

ప్రాజెక్ట్ కే నుండి టెర్రిఫిక్ అప్ డేట్

Thu 28th Jul 2022 03:46 PM
project k,prabhas,ashwini dutt,nag ashwin,avengers,indian avengers  ప్రాజెక్ట్ కే నుండి టెర్రిఫిక్ అప్ డేట్
Project K release date announcement ప్రాజెక్ట్ కే నుండి టెర్రిఫిక్ అప్ డేట్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే(వర్కింగ్ టైటిల్) పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో.. ఆ సినిమా నుండి అప్ డేట్ వచ్చిన ప్రతిసారి ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్, సలార్ షూటింగ్ ని ఒకే టైం లో చేస్తున్నారు. భారీ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్‌గా ప్రాజెక్ట్ కే తెరకెక్కుతుంటే.. సలార్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. 500 కోట్ల బడ్జెట్ తో అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కే కి సంబంధించి మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. అయితే తాజాగా ప్రాజెక్ట్ కే నుండి ఆ సినిమా నిర్మాత అశ్విని దత్ టెర్రిఫిక్ అప్ డేట్ ఇవ్వడంతో ప్రభాస్ ఫాన్స్ గాల్లో తేలిపోతున్నారు. 

2023 అక్టోబర్ 18న ప్రభాస్ బర్త్ డే వీక్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నామని, కాదు అనుకుంటే 2024 జనవరి లో ప్రాజెక్ట్ కే రిలీజ్ ఉంటుంది అని అశ్విని దత్ చెప్పారు. అంతేకాకుండా చైనా, అమెరికా మరియు ఇంటర్ నేషనల్ మార్కెట్లను లక్ష్యంగా ఈ సినిమాని రిలీజ్ చెయ్యబోతున్నాము అని, ఎవెంజర్స్ తరహా లో ప్రాజెక్ట్ కే ఉండబోతుంది అని.. అమితాబ్ బచ్చన్ గారు మునుపెన్నడూ లేనివిధంగా కనిపిస్తారని, అన్నింటికంటే మించి ప్రభాస్ అయితే  టెర్రిఫిక్ అంతే అంటూ అశ్విని దత్ ప్రాజెక్ట్ కే పై అంచనాలు పెంచేశారు. ప్రాజెక్ట్ కే దాదాపు 90% షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగునుందని, అలాగే ప్యాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి గ్రాఫిక్స్ ఇతరత్రా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు చాలా సమయం కావాలి కాబట్టి ఈ సినిమా షూట్ కంప్లీటైన 10 నెలల తర్వాత ఈ సినిమాను విడుదల చేయనున్నారు తెలుస్తోంది.

Project K release date announcement:

Project K Is Indian Avengers

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ