Advertisementt

NTR30 లేట్ పై కళ్యాణ్ రామ్ క్లారిటీ

Wed 27th Jul 2022 10:07 PM
kalyan ram,ntr30,ntr,tarak,koratala shiva,ntr30 update  NTR30 లేట్ పై కళ్యాణ్ రామ్ క్లారిటీ
Kalyan Ram Clarity on NTR30 Late NTR30 లేట్ పై కళ్యాణ్ రామ్ క్లారిటీ
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత కొరటాల శివ తో NTR30 చెయ్యాల్సి ఉంది. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో జూన్ నుండి కొరటాల మూవీ మొదలు పెట్టబోతున్నట్లుగా ఎన్టీఆర్ చెప్పినప్పటికీ.. ఆగస్టు వచ్చేస్తున్నా ఇప్పటివరకు NTR30 కార్య రూపం దాల్చలేదు. రీసెంట్ గా NTR30 సెప్టెంబర్ రెండో వారం నుండి మొదలు కాబోతుంది అంటున్నారు. తాజాగా బింబిసారా ప్రమోషన్స్ లో NTR30 కి వన్ అఫ్ ద నిర్మాత అయిన కళ్యాణ్ రామ్ NTR30  లేట్ అవ్వడానికి గల కారణాలు బయటపెట్టారు.

NTR30 విషయంలో తారక్ చాలా ఆలోచిస్తున్నాడు.. ట్రిపుల్ ఆర్ తో ఎన్టీఆర్ ఇమేజ్ పాన్ ఇండియా లెవల్ కి కాదు.. గ్లోబల్ కి చేరుకుంది. అలాంటి టైం లో ఎన్టీఆర్ నెక్స్ట్ చెయ్యబోయే ప్రాజెక్ట్ పై ఎన్టీఆర్ కి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఓ స్టేజ్ కి వెళ్ళాకా భయం తో పాటుగా బాధ్యత కూడా పెరుగుతుంది. దానితో ఆటోమాటిక్ గా జాగ్రత్తలు పెరుగుతాయి. నిర్మాతలుగా మాపై కూడా చాలా బాధ్యత ఉంది. మేము కూడా ఆలోచిస్తున్నాం, డైరెక్టర్ కూడా అంతే ఆలోచనలో ఉంటారు. ఎన్టీఆర్ గత హిట్ తాలూకు ప్రెజర్ దర్శకుడిపై ఎంత ఉంటుందో మీకు చెప్పక్కర్లేదు. అందుకే ఫాన్స్ కోరుకున్నట్టుగా ఫాస్ట్ గా అప్ డేట్స్ ఇవ్వలేకపోతున్నాం. ప్రతి విషయాన్ని అలోచించి స్టెప్ వెయ్యాల్సి వస్తుంది అంటూ కళ్యాణ్ రామ్ NTR30 ఆలస్యమవ్వడానికి గల కారణాలు రివీల్ చేసారు.

Kalyan Ram Clarity on NTR30 Late:

Kalyan Ram about NTR30 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ