Advertisementt

సాయి ప్రియ కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు

Wed 27th Jul 2022 07:57 PM
sai priya,visakhapatnam,vizag,visakhapatnam sai priya missing case  సాయి ప్రియ కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు
Big twist in Visakhapatnam Sai Priya missing case సాయి ప్రియ కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు
Advertisement
Ads by CJ

సోమవారం విశాఖ బీచ్ లో భర్త తో షికారుకు వెళ్లి అలల ఒరవడిలో కొట్టుకుపోయింది అనుకున్న సాయి ప్రియ.. భర్త కంప్లైంట్ మేరకు ఏపీ ప్రభుత్వం రెస్యూ టీమ్స్ ని దింపి వెతికినా ఫలితం లేకపోయింది. సోమవారం భర్త తో కలిసి బీచ్ కి వెళ్లిన సాయి ప్రియ ఆమె భర్త ఫొటోస్ దిగుతుండగా.. భర్త ఫోన్ లో మెసేజెస్ చూసుకునే క్రమంలో సాయి ప్రియ కనిపించకుండా పోవడంతో, అతను అక్కడంతా వెతికి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చెయ్యగా.. ప్రభుత్వం వెంటనే రెస్క్యూ టీం తో వెతికించారు. 

ఒక హెలికాఫ్టర్, బోట్స్, ఇంకా ప్రభుత్వ యంత్రాంగం 48 గంటలుగా వెతికినా ఆమె ఆచూకీ దొరకకపోవడంతో సాయి ప్రియ పై అనుమానంతో వేరే రూట్ లో ఇన్వెస్టిగేషన్ చెయ్యగా.. ఆమె ప్రియుడుతో నెల్లూరికి పరారైనట్లుగా తెలిసింది. తర్వాత సాయి ప్రియని పట్టుకుని వైజాగ్ తీసుకొచ్చే క్రమంలో పోలీస్ అటు ట్రై చేస్తుండగా.. ఆమె మరో ట్విస్ట్ ఇచ్చింది. అదేమిటంటే సాయి ప్రియ తన తల్లితండ్రులకి వాట్స్ ఆప్ మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ లో తాను బెంగుళూర్ లో క్షేమంగా ఉన్నాను అని, తన గురించి వెతకొద్దు అంటూ మెసేజ్ చెయ్యడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. 

సాయి ప్రియ, ఆమె ప్రియుడు ముందు అనుకున్న ప్లాన్ ప్రకారమే భర్త నుండి బీచ్ లో తప్పించుకుని అక్కడే మాటు వేసిన ప్రియుడితో ఆమె ట్రైన్ లో నెల్లూరికి పారిపోయినట్లుగా, ఆమె ఫోన్ సిగ్నల్స్ కావలిలో చూపించినట్లుగా పోలీస్ లు కనిపెట్టడంతో.. ఇక సాయి ప్రియ తల్లితండ్రులకి మెసేజ్ పెట్టి తనని వెతకొద్దు అంటూ మెడలో తాళి బొట్టు ఉన్న ఫోటో ని షేర్ చేస్తూ కూల్ గా రిప్లై ఇచ్చింది. తాను ప్రియుడు రవిని వివాహం చేసుకున్నాను అని, తమని వెతికి పెట్టుకోవాలంటే ఇద్దరం చనిపోతామని సాయి ప్రియ ఆ మెసేజ్ లో బెదిరించడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఆమెని వెతకడానికి విశాఖ బీచ్ లో అయిన ఖర్చు 75 నుండి కోటి రూపాయలు ఖర్చు అయినట్లుగా అక్కడి అధికారులు చెప్పడం విశేషం.  

Big twist in Visakhapatnam Sai Priya missing case:

New Twist in Vizag Sai Priya Missing Case

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ