ఈటీవీలో ఎన్నో ఏళ్లుగా జబర్దస్త్ షో ని తన అంద చందాలతో, గ్లామర్ తో ఓ ఊపు ఊపిన అనసూయ భరద్వాజ్ కామెడీ ప్రియులకి, జబర్దస్త్ కమెడియన్స్ కి షాకిస్తూ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యింది. ఈ వారం తర్వాత అనసూయ ఈటివి లో కనిపించే ఛాన్స్ లేదు. అంటే జబర్దస్త్ చేస్తే.. అక్కడ జరిగే ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ లోను యాంకర్ గానో, జేడ్జ్ గానో కనిపించేవారు. మరి అనసూయ క్రేజ్ ని బట్టి ఆ ప్రోగ్రామ్స్ లోకి ఏమైనా ఆహ్వానిస్తారేమో చూడాలి. కానీ అనసూయ ఈటీవి వదిలేస్తుంది అనగానే స్టార్ మా లో ప్రత్యక్షమైంది. అక్కడ సుధీర్ తో కలిసి సూపర్ సింగర్ జూనియర్స్ కి యాంకరింగ్ చేస్తుంది.
అలాగే స్టార్ మా లో ప్రత్యేక షోస్ కి జేడ్జ్ గా వచ్చే అనసూయ ఇప్పుడు జెమిని ఛానల్ లోనూ తేలింది. గతంలో శ్రీముఖి యాంకరింగ్ చేసిన తల్లా పెళ్ళామా ప్రోగ్రాం కి షో కి అనసూయ గ్లామర్ షో తో రెచ్చిపోతూ యాంకరింగ్ మొదలు పెట్టేసింది. సెలెబ్రిటీస్ జోడిలని తీసుకు వచ్చి మీకు తల్లి ముఖ్యమా? పెళ్ళాం ముఖ్యమా? అంటూ గేమ్ షో ఆడించబోతుంది. ఇప్పటికే రవి ఫ్యామిలీ తో అనసూయ తల్లా పెళ్ళామా గేమ్ షో ఆడిన ప్రోమో జెమినీ లో వస్తుంది. అక్కడ ఈటివి లో పాపులర్ షో వదిలేసి.. ఇలాంటి చిల్లర షోస్ చెయ్యడం ఏమిటి అనసూయా అంటూ ఆమె అభిమానులు తీవ్రంగా హార్ట్ అవుతున్నారు.