యంగ్ టైగర్ ఎన్టీఆర్ బింబిసారా ట్రైలర్ ని రిలీజ్ చెయ్యబోతున్నారు.. గెస్ట్ గా ఎన్టీఆర్ ని ఫిక్స్ చేసి మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు అంటూ ఫాన్స్ ఊగిపోయారు. కానీ ఎన్టీఆర్ బింబిసారా ట్రైలర్ ని ఈవెంట్ కి వచ్చి రిలీజ్ చెయ్యడం లేదు, డిజిటల్ గా రిలీజ్ చేస్తూ ఫాన్స్ కి షాక్ ఇచ్చారు. ఎన్టీఆర్ పబ్లిక్ అప్పీరియన్స్ కోసం ఫాన్స్ వెయిటింగ్. కానీ ఇప్పుడు ఆ కోరిక తీరకపోగా.. ఆగష్టు నుండి ఎన్టీఆర్ - కొరటాల కాంబో NTR30 మొదలు కాబోతుంది అని ఎన్టీఆర్ ఫాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. అసలే ఆగష్టు 1 నుండి షూటింగ్ లు బంద్ అంటున్నారు.
దానితో ఎన్టీఆర్ ఫాన్స్ మళ్ళీ షూటింగ్స్ లు మొదలయ్యాకే ఎన్టీఆర్ - కొరటాల మూవీ మొదలవుతుంది. ఆగష్టు లోనే మొదలు కావొచ్చు అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ NTR30 ఆగష్టు నుండి కాదు సెప్టెంబర్ రెండో వారం నుండి సెట్స్ మీదకి వెళ్లొచ్చనే న్యూస్ తో ఎన్టీఆర్ ఫాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ మేకోవర్ పై దృష్టి పెట్టి వెయిట్ తగ్గుతున్నారు. అందుకే బింబిసారా ట్రైలర్ లాంచ్ కి పబ్లిక్ లోకి రావడం లేదు అని తెలుస్తుంది. ఇక NTR30 కోసం జూబ్లీహిల్స్ లోనే ఓ ప్రత్యేకమైన భారీ సెట్ వేస్తున్నారట. సినిమాలోని చాలా భాగం షూటింగ్ ఆ సెట్ లోనే జరగబోతున్నట్టుగా తెలుస్తుంది.