Advertisementt

ICW ఫ్యాషన్ షో లో రష్మిక మెరుపులు

Wed 27th Jul 2022 11:26 AM
rashmika mandanna,indian couture week,icw 2022  ICW ఫ్యాషన్ షో లో రష్మిక మెరుపులు
Rashmika Mandanna sets ramp on fire ICW ఫ్యాషన్ షో లో రష్మిక మెరుపులు
Advertisement
Ads by CJ

ఇప్పుడు ఏ భాషలో చూసినా రష్మిక పేరే వినిపిస్తుంది. అంతలాంటి ఆఫర్స్ తో రష్మిక జోరు, హుషారు కనిపిస్తుంది. కన్నడ నుండి మెల్లగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టడంతో స్టార్ ఆఫర్స్ తలుపుతట్టాయి. పుష్ప పాన్ ఇండియా మూవీతో ఆమె కెరీర్ లో వెనుదిరిగి చూడక్కర్లేకుండా మారిపోయింది. తమిళంలో విజయ్ తో వారసుడు ఆఫర్ తోనే ఎగ్జైట్ అవుతున్న రశ్మికకి బాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచింది. అక్కడ అమితాబ్, సిద్దార్థ్ మల్హోత్రా, రణబీర్ కపూర్ మూవీస్ తో బిజీ అయ్యింది. 

బాలీవుడ్ లోకి అడుగుపెట్టిందో లేదో.. రష్మిక గ్లామర్ డాల్ లా మారిపోయింది. అక్కడ జరిగే ఈవెంట్స్ కి గ్లామర్ అని చెప్పడం కంటే.. హాట్ గా రెడీ అయ్యి వెళుతుంది. కొన్నిసార్లు రష్మిక డ్రెస్సెస్ తో ట్రోల్ అయినా.. రష్మిక అందాల  ఆరబోత విషయంలో తగ్గేదే లే అంటుంది. తాజాగా సీత రామం మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రష్మిక లేటెస్ట్ అందాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న  సమయంలో బాలీవుడ్ లో జరిగిన ICW2022 ఫ్యాషన్ షో లో మెరుపులు మెరిపించింది. రెడ్ కలర్ డిజైనర్ డ్రెస్ తో రష్మిక ఫ్యాషన్ వీక్ లో చేసిన వాక్ హైలెట్ గా నిలువగా.. అందరూ రష్మిక స్టయిల్ గురించే మాట్లాడుకుంటున్నారు.

Rashmika Mandanna sets ramp on fire :

Rashmika Mandanna sets ramp on fire at Indian Couture Week

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ