సీరియల్ నటులు ఇప్పుడు సీరియల్స్ చెయ్యడమే కాదు, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా గలగలా మాట్లాడేస్తూ వ్యూస్ రాబడుతూ తెగ సంపాదించేస్తున్నారు. ఇంట్లో కూర వండినా వీడియోనే. కూరగాయలు కొన్నా వీడియోనే, షాపింగ్ చేసినా వీడియోనే, లంచ్, డిన్నర్ కి వెళ్లినా వీడియో అలా ఉంది సీరియల్ నటుల యూట్యూబ్ సంపాదనలు. ఇక ఆ వీడియోస్ లో వారేం చేస్తున్నా గలగలా మట్లాడుతూ ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేస్తుంటారు. అయితే సీరియల్ నటి శ్రీ వాణి అటు సీరియల్స్, ఇటు యూట్యూబ్ ఛానల్ అంటూ ఎప్పుడూ ప్రేక్షకులకి దగగ్రగానే ఉంటుంది. కొంతమంది నటులు యూట్యూబ్ ఛానల్స్ వారితో టై అప్ అయ్యి వీడియోస్ చేస్తూ ఉంటుంది. ఆమె వాయిస్ ఆమెకి ప్లస్ పాయింట్. ఈటీవీలో చంద్రముఖి సీరియల్ ద్వారా ఫెమస్ అయిన శ్రీవాణి ప్రస్తుతం శతమానం భవతి సీరియల్ లో నటిస్తుంది.
అలాగే భర్త విక్రమాదిత్య, కూతురు నందిని తో యూట్యూబ్ వీడియోస్ చేసే శ్రీవాణి ప్రస్తుతం మాట్లాడలేని స్థితిలో ఉండడం ఆమె అభిమానులకి షాకిచ్చింది. కారణం ఆమె గొంతులో చిన్నపాటి వాపు రావడంతో ఆమె ఓ నెలరోజుల పాటు మాట్లాడకుండా ఉండాలని డాక్టర్స్ చెప్పినట్లుగా ఆమె భర్త విక్రమాదిత్య చెబుతున్నాడు. తాజాగా యూట్యూబ్ వీడియో లో శ్రీవాణి భర్త విక్రమ్ శ్రీవాణి విషయం చెప్పకూడదు అంటూనే ఆమెకి కొద్దిరోజులుగా జలుబు ఉండడంతో గొంతు ప్రాబ్లెమ్ వచ్చిందేమో అనుకున్నాము, డాక్టర్ దగ్గరకి వెళ్లగా జలుబు కాదు, ఆమె గొంతు లో వచ్చిన వాపు కారణంగా ఆమె మాట్లాడలేకపోతుంది. ఓ నెలపాటు మందులు వాడుతూ అస్సలు మట్లాడకూడదు అని చెప్పినట్లుగా విక్రమాదిత్య ఆ వీడియో ద్వారా శ్రీవాణి మాట్లాడకపోవడానికి కారణం చెప్పుకొచ్చాడు.