పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వైరల్ ఫీవర్ నుండి కోలుకుంటున్నారు. రాజకీయాలతో బిజీగా ఉండడం, వర్షాకాలం అవడంతో పవన్ కళ్యాణ్ సిక్ అయ్యారు. దానితో ఆయన చేస్తున్న సినిమాలు కూడా ఆగిపోయాయి. అయితే మే నెలలోనే పవన్ కళ్యాణ్ చెయ్యాల్సిన క్రిష్ హరిహర వీరమల్లుకి బ్రేకులు పడగా.. హరిహర వీరమల్లు రషెస్ చూసిన పవన్ సంతృప్తిగా లేని కారణంగానే.. ఆ షూటింగ్ ఆగిపోయింది అన్నారు. కాదు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడం వలనే హరిహర వీరమల్లు షూటింగ్ కి గ్యాప్ తీసుకున్నారు అంటున్నారు. క్రిష్ ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ తో భారీ సెట్స్ వేశారు. నిర్మాత ఏమైపోతాడో అనే ప్రచారం జోరుగానే జరుగుతుంది.
అయితే ఇప్పుడు హరిహర వీరమల్లు షూటింగ్ విషయంలో రెండు నెలలుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టింది చిత్ర బృందం. ఆగష్టు నుండి అంటే ఆగష్టు 11 నుండి హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ కి టీం సమాయత్తమవుతోంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్రిష్ ఈ షెడ్యూల్ షూటింగ్ చేయబోతున్నారట. ఒక పాటతో పాటు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్‌కి సంబంధించిన ఎపిసోడ్ మొత్తం ఈ షెడ్యూల్లోనే పూర్తి చేయాలని క్రిష్ భావిస్తున్నాడని సమాచారం. ఇక పవన్ హరిహర వీరమల్లు తో పాటుగా మేనల్లుడు సాయి తేజ్ తో చెయ్యబోయే రీమేక్ షూటింగ్ లోను పాల్గొంటారని తెలుస్తుంది.