Advertisementt

మహేష్ మాదిరి ఎన్టీఆర్ కూడా చెయ్యాల్సింది

Tue 26th Jul 2022 04:10 PM
ntr 30,ntr,koratala,mahesh babu,ssmb28,trivikram  మహేష్ మాదిరి ఎన్టీఆర్ కూడా చెయ్యాల్సింది
Koratala - NTR combo update మహేష్ మాదిరి ఎన్టీఆర్ కూడా చెయ్యాల్సింది
Advertisement
Ads by CJ

మహేష్ బాబు-త్రివిక్రమ్ మూవీ జూన్ లోనే మొదలు కావాల్సి ఉన్నప్పటికీ.. అది ఏదో కారణాల చేత లేట్ అవడంతో మహేష్ ఫాన్స్ నానా రచ్చ చెయ్యడమే కాదు, త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఇంకా మహేష్ కి నచ్చని కారణంగానే సినిమా లేట్ అవుతుంది అంటూ ప్రచారం షురూ అయ్యేసరికి మహేష్-త్రివిక్రమ్ SSMB 28 ఆగష్టు నుండి మొదలు పెట్టి వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేసారు. దానితో మహేష్ వెకేషన్స్ కి వెళ్ళాడు, ఫాన్స్ కూల్ అయ్యారు. 

ఇక మిగిలింది ఎన్టీఆర్. ఎన్టీఆర్-కొరటాల శివ మూవీ కూడా జూన్ నుండే పట్టాలెక్కాల్సి ఉండగా.. ఇప్పటివరకు ఆ సినిమా పై ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో కొరటాలపై ఎన్టీఆర్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. మరోపక్క కొరటాల ఆచార్య సమస్యల్లో ఇరుక్కుని గిలగిలలాడుతున్నారంటూ వార్తలు రావడం, ఎన్టీఆర్ కూడా కొరటాలపై సందేహంగా ఉన్నాడంటూ ఏవేవో న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే ఎన్టీఆర్ ఫాన్స్ లో గుబులు మొదలయ్యింది. మరి ఎన్టీఆర్-కొరటాల NTR30 ఆగష్టు నుండో లేదా సెప్టెంబర్ నుండో మొదలవుతుంది అని ఏ పోస్టర్ లేదా వీడియో వదిలితే ఫాన్స్ కూల్ అయ్యేవారు. మహేష్ మాదిరి ఎన్టీఆర్ కూడా చెయ్యాల్సింది అనేది నెటిజెన్స్ అభిప్రాయం.

Koratala - NTR combo update :

NTR30 update please: fans request

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ