Advertisementt

ప్రభాస్ ని ఎత్తేస్తున్న తారామణి

Tue 26th Jul 2022 12:42 PM
disha patani,project k,deepika padukone,prabhas  ప్రభాస్ ని ఎత్తేస్తున్న తారామణి
Disha Patani on Prabhas ప్రభాస్ ని ఎత్తేస్తున్న తారామణి
Advertisement
Ads by CJ

ప్రభాస్ తో పని చేసే ఏ హీరోయిన్ అయినా ప్రభాస్ ని పొగడకుండా ఉండదు. గతంలో సాహో టైం లో ప్రభాస్ శ్రద్ద కపూర్ కి తన ఇంటి నుండి భోజనం తెప్పించి పెట్టిన విషయాన్ని కెరీర్స్ తో సహా పోస్ట్ చేసింది. ప్రభాస్ సెట్స్ లో చాలా సరదాగా ఉంటాడు అంటూ అప్పట్లో ప్రభాస్ పై శ్రద్ద కపూర్ కామెంట్స్ చేసింది. తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ లో విలన్ రోల్ చేసిన సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్ కూడా ప్రభాస్ ఆతిథ్యాన్ని స్వీకరించింది. ఇక ప్రాజెక్ట్ కే సెట్స్ లో జాయిన్ అయిన దీపికాని ప్రభాస్ తన ఇంటి వంటతో సర్ ప్రైజ్ చెయ్యగా.. దీపికా పదుకొనే ప్రభాస్ ప్రేమని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

తాజాగా ప్రాజెక్ట్ కే లో నటిస్తున్న మరో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని కూడా ఇప్పుడు ప్రభాస్ ని ఆకాశానికి ఎత్తేస్తుంది. ఈమధ్యనే షూటింగ్ లో జాయిన్ అయిన దిశా పఠానికి ప్రభాస్ తన ఇంటి వంటని పరిచయం చేసాడట. దానితో దిశా పటాని ప్రభాస్ గురించి వినడమే కానీ, చూసింది లేదు, ప్రభాస్ తానొక పెద్ద హీరో అనే విషయాన్ని పక్కన పెట్టి, చాలా సింపుల్ గా ఉంటాడని విన్నాను. ఇప్పుడు నిజంగా చూస్తున్నాను ఆయన ఎంత మంచి మనిషి అనేది. ఇంతకుముందు అందరూ చెప్పినట్టే ప్రభాస్ తన ఇంటి నుంచి తెప్పించిన భోజనాన్ని స్వయంగా వడ్డించాడు. ప్రభాస్ చూపించే అభిమానాన్ని ఎవరూ మరిచిపోలేరు. అలాంటి హీరోను నేను ఇంతవరకూ చూడలేదు. నా కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ట్రీట్ ఇచ్చాడు ప్రభాస్ అంటూ దిశా ప్రభాస్ ని పొగిడేస్తూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. 

Disha Patani on Prabhas:

Disha Patani in awe of Prabhas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ