Advertisementt

Meag154 కథపై ఇంట్రెస్టింగ్ న్యూస్

Tue 26th Jul 2022 11:58 AM
mega 154,chiranjeevi,bobby,ravi teja,chiru 154  Meag154 కథపై ఇంట్రెస్టింగ్ న్యూస్
Mega 154 story leaked Meag154 కథపై ఇంట్రెస్టింగ్ న్యూస్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీ కలిసి చేస్తున్న Mega 154 షూటింగ్ పరుగులు పెట్టిస్తున్నారు. వాల్తేర్ వీరయ్య గా టైటిల్ ఫిక్స్ చేసుకోబోతున్న మెగా 154 మూవీ లో రవితేజ కూడా నటించడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. అటు హీరోయిన్ గా శృతి హాసన్, ఇటు రవితేజ చిరు కి తమ్ముడిగా కనిపించడం అన్ని ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తాజాగా వాల్తేర్ వీరయ్య కథపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. ఈ సినిమా సెట్స్ లోకి రీసెంట్ గా అడుగుపెట్టిన రవితేజ - చిరు అన్నదమ్ములుగా కనిపిస్తారని తెలుస్తుంది.

అది కూడా సవతి సోదరులుగా చిరు - రవితేజ కనిపించడమే కాకుండా వీరిద్దరి మధ్యన సవతి పోరు నడుస్తుంది అని, రవితేజ - చిరంజీవి మధ్యలో పవర్ ఫుల్ సన్నివేశాలతో పాటుగా, పవర్ ఫుల్ డైలాగ్స్ ఉండబోతున్నాయట. రవితేజ - చిరు మధ్యలో వచ్చే ప్రతి సీన్ మెగా ఫాన్స్ నే కాదు, మాస్ ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేసేవిలా, విజిల్స్ వేయించేవిలా ఉంటాయంటున్నారు. చిరంజీవి - ర‌వితేజ మ‌ధ్య వచ్చే క్లాషే.. ఈ సినిమాకి హైలెట్ అని, అది ఎందుకు వస్తుంది, దర్శకుడు బాబీ దానిని ఎంత బలంగా చూపిస్తాడు అనేది ట్విస్ట్ అంటున్నారు.

Mega 154 story leaked :

Interesting news on Mega 154

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ