Advertisement

సినిమాలకి బ్రేక్ ఇచ్చేసినట్లేనా

టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ బర్త్ డే నేడు. హీరోగా వరసగా సినిమాలు చేసిన నారా రోహిత్ గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నాడు. అతను ఒప్పుకున్న సినిమాలు మూడో నాలుగో ఉన్నాయి. కానీ ఆ సినిమా షూటింగ్స్ తాలూకు అప్ డేట్స్ లేవు. ఫ్రెండ్ శ్రీ విష్ణు సినిమా ఫంక్షన్స్ లో మత్రమే దర్శనమిస్తున్న నారా రోహిత్ బరువు తగ్గి హీరోగా స్లిమ్ లుక్ లో సర్ ప్రైజ్ ఇస్తాడని గత ఏడాది వరకు ప్రచారం జరిగినా.. నారా రోహిత్ బరువులో ఎలాంటి మార్పు లేదు, అలాగే ఆయన సినిమా షూటింగ్స్ కి హాజరైన దాఖలాలు లేవు. అప్పట్లో ఒకడుండేవాడు, జ్యో అచ్యుతానంద, సోలో లాంటి సినిమాలతో ప్రత్యేకతని చాటిన నారా రోహిత్ సినిమాకి ఎందుకు బ్రేక్ ఇచ్చాడో ఫాన్స్ ఎవరికి అర్ధం కావడం లేదు. 

ఈ రోజు నారా రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా అయినా ఆయన నటిస్తున్న సినిమాల నుండి ఎమన్నా లుక్స్ వదులుతారేమో చూడాలి. ఏది ఏమైనా రోహిత్ సినిమా షూటింగ్ లు విషయాలు మాత్రం తెలియడం లేదు. అసలు ఆ సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయా? లేదంటే ఆగిపోయాయా? అనేది ఈ రోజు రిలీజ్ అయ్యే లుక్స్ ని బట్టి డిసైడ్ అవుతుంది. నారా రోహిత్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్రెండ్స్, సన్నిహితులు, సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సినీజోష్ టీం తరుపున నారా రోహిత్ కి ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.

Nara Rohith Birthday Special News

Nara Rohith Birthday Special
nara rohith
nara rohith birthday special
nara rohith birthday news