Advertisementt

నితినే కాదు, గోపీచంద్ కూడా మోసం చేసాడు

Mon 25th Jul 2022 10:49 PM
amma rajasekhar,shankham movie,nithin,gopichand  నితినే కాదు, గోపీచంద్ కూడా మోసం చేసాడు
Amma Rajasekhar Sensational comments on Gopichand నితినే కాదు, గోపీచంద్ కూడా మోసం చేసాడు
Advertisement
Ads by CJ

ఈమధ్యన దర్శకుడు, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ హీరో నితిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. నితిన్ తన సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా వస్తాను అని చెప్పి రాకుండా మోసం చేసాడు, నితిన్ కి నేను డాన్స్ నేర్పించాను. గురువు పిలిస్తే రావాల్సింది పోయి హైదరాబాద్ లోనే ఉండి.. నా ఈవెంట్ కి రాకుండా నన్ను మోసం చేసాడు అంటూ అమ్మా రాజశేఖర్ ఎమోషనల్ గా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నితిన్ మాత్రమే మోసం చెయ్యలేదు.. టాలీవుడ్ లో మరో హీరో కూడా మోసం చేసాడు అంటున్నాడు. అది హీరో గోపీచంద్ అంటూ అమ్మ రాజశేఖర్ ఆ హీరో పేరు కూడా రివీల్ చేసాడు.

ఎటువంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లని గోపీచంద్ తనని మోసం చేసాడు అని అమ్మ రాజశేఖర్ చెప్పడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. గోపీచంద్ తో అమ్మ రాజశేఖర్ రణం అనే మూవీ చేసాడు. ఆ రణం తర్వాత గోపిచంద్ తనతో మరో మూవీ చేద్దామని చెప్పాడని, అప్పుడే మరొక సినిమా కోసం గోపీచంద్ తో తాను ఒక లైన్ కూడా చెప్పాను అని, ఆ లైన్ నచ్చి తప్పకుండా సినిమా చేద్దామని గోపీచంద్ మాటిచ్చాడు. ఆతర్వాత నాకు సురేష్ ప్రొడక్షన్ నుండి పిలుపు వచ్చింది. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. వెంకటేష్ గారితో సినిమా చేసే అవకాశం వచ్చింది. స్పెషల్ సెట్ కూడా వేయించారు. ఇక అన్ని పూర్తి చేసుకుని వెంకటేష్ తో సినిమా మొదలు పెడదాం అనుకున్న టైం లో గోపీచంద్ - సత్య రాజ్ కలయికలో శంఖం రిలీజ్ అయ్యింది. 

ఆ సినిమా చూస్తే నేను గోచంద్ కి చెప్పిన కథ లాగే అనిపించి షాక్ అయ్యాను. అప్పుడు నిర్మాత సురేష్ బాబు కూడా ఆ కథ వద్దు, మరొక కథతో సినిమా చేద్దాము అని అన్నాడు. కానీ ఆ తర్వాత మళ్లీ ప్రాజెక్ట్ సెట్ కాలేదు, అప్పుడు చాలా ఏడ్చాను.. అంటూ అమ్మా రాజశేఖర్ గోపీచంద్ తనని మోసం చేసాడు అంటూ సంచలన విషయాలను బయట పెట్టాడు. 

Amma Rajasekhar Sensational comments on Gopichand:

Amma Rajasekhar comments on Gopichand

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ