బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబోలో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న NBK107 షూటింగ్ ప్రస్తుతం కర్నూలులోని కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్‌లో జరుగుతుంది. ఈ రోజు సోమవారం నుండి మొదలైన ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేపట్టారు. బాలకృష్ణ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్న ఈ సినిమాలో బాలయ్య మాస్ లుక్ ఫాన్స్ కి పూనకాలు తెప్పించేదిగా ఉంటే.. ఆ మాస్ కేరెక్టర్ తో బాలయ్య చెప్పే డైలాగ్స్ కి థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయంగా కనిపిస్తుంది రీసెంట్ గా వదిలిన టీజర్. ఇక మరో కేరెక్టర్ లో బాలయ్య సరసన గ్లామర్ హీరోయిన్ శృతి హాసన్ నటిస్తుంది.
తాజా షెడ్యూల్ లో శృతి హాసన్ కూడా NBK107 టీం తో జాయిన్ అయ్యింది. కర్నూన్ లో బాలయ్య, శృతి హాసన్ ఇంకా కీలక నటులు పాల్గొన్న ఈ రోజు షూటింగ్ లో కర్నూల్ కొండారెడ్డి బురుజు మీదుగా శవయాత్ర జరుగుతున్నట్టుగా, చుట్టూ జనాలు గుమిగూడిన సీన్స్ ని తెరకెక్కిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. షూటింగ్ లో ఖాళీ సమయంలో శృతి హాసన్ ఓ సెల్ఫీ తీసింది. అందులో బాలకృష్ణ స్టైలిష్ లుక్ లో చమటలు కక్కుతూ కనిపిస్తుండగా.. డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఫ్రేమ్ లో మెరిశాడు. శృతి హాసన్ కూడా ఆ సెల్ఫీ లో మోడరన్ అవతార్ లో కనిపిస్తుంది. ప్రస్తుతం శృతి హాసన్ బాలయ్య తో దిగిన సెల్ఫీ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వగా నందమూరి ఫాన్స్ ఆ పిక్ ని తెగ షేర్ చేస్తూ మీసాలు మెలేస్తున్నారు.