Advertisementt

బాలీవుడ్ పాపులర్ జంటకి బెదిరింపులు

Mon 25th Jul 2022 02:10 PM
katrina kaif,vicky kaushal,social media,case  బాలీవుడ్ పాపులర్ జంటకి బెదిరింపులు
Katrina Kaif, Vicky Kaushal get death threats బాలీవుడ్ పాపులర్ జంటకి బెదిరింపులు
Advertisement
Ads by CJ

కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగినా మీడియాకి ఎక్కువగా ఫోకస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుని పెళ్లి విషయంలోనూ అంతే సీక్రెట్ ని మెయింటింగ్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరూ మీడియా లో హైలెట్ అయిన బాలీవుడ్ పాపులర్ జంట విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ లు. వీరిద్దరి పెళ్లి రాజస్థాన్లోని ఓ రిసార్ట్స్ లో అంగరంగ వైభవంగా జరగగా.. తర్వాత ఈ ఇద్దరూ హానిమన్ కి వెళ్లొచ్చి ఎవరి షూటింగ్స్ లో వారు బిజీ అయ్యారు. రీసెంట్ గా కత్రినా కైఫ్ బర్త్ డే వేడుకల కోసం వెకేషన్స్ కి వెళ్లి సోషల్ మీడియాలో హడావిడి చేసిన ఈ జంటకి చంపేస్తామంటూ బెదిరింపులు రావడం హాట్ టాపిక్ గా మారింది.

విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ ని దారుణంగా హింసించి చంపేస్తాను అంటూ ఓ నెటిజెన్ సోషల్ మీడియాలో తరచూ పోస్ట్ లు పెడుతూ ఉండడంతో పోలీస్ లు ఈ విషయంలో దర్యాప్తు చేసి ఆ గుర్తు తెలియని వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. ఆ వ్యక్తి తో ప్రస్తుతం ప్రమాదం లేకపోయినా.. ఎప్పుడైనా విక్కీ కౌశల్ - కత్రినాలపై దాడి జరగొచ్చనే అనుమానం పోలీస్ లు వ్యక్తం చేస్తున్నారు.

Katrina Kaif, Vicky Kaushal get death threats:

Katrina Kaif - Vicky Kaushal Get Death Threat On Social Media, Case Filed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ