విశాల్ హీరోగాఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ లాఠీ. హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాల్ సరసన ఈ చిత్రంలో సునైనా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం నుండి తాజాగా టీజర్ విడుదలైయింది.
1నిమిషం 38సెకన్ల నిడివి గల లాఠీ టీజర్ ఫుల్ పవర్ ప్యాక్డ్ గా వుంది. వంటినిండా గాయాలు, చేతికి కట్లు వున్న విశాల్.. చుట్టుముట్టిన రౌడీ మూకలని చూస్తూ.. రేయ్... తప్పు చేసి తలదాచుకునే పోకిరివి... నీకే ఇంత పొగరున్నప్పుడు... ఆ తప్పుని నిలదీసే పోలీసోడ్ని... నాకు ఎంత పొగరుంటుంది
అని వార్నింగ్ ఇవ్వడం పోలీస్ పవర్ ని చూపించింది. విశాల్ తన సీనియర్ అధికారులకు సెల్యూట్ చేస్తూ డ్యూటీని నిజాయితీగా చేసి పోలీస్ గా కనిపించారు. ఆ తర్వాత నిర్మాణంలో ఉన్న భవనంలో వచ్చిన భారీ యాక్షన్ బ్లాక్ అద్భుతంగా వుంది. బిల్డింగ్ లో వరుసగా లైట్లు వెలగడం, గుంపులుగా రౌడీలు రావడం, విశాల్ రౌడీ మూకలపై యుద్ధాన్ని ప్రకటించడం టెర్రిఫిక్ గా వుంది. విధిని నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్క చేయని పోలీసు పాత్రలో విశాల్ నటన బ్రిలియంట్ గా వుంది. దర్శకుడు వినోద్ కుమార్ విశాల క్యారెక్టర్‌ని మాస్‌గా ఆకట్టుకునేలా ప్రెజెంట్ చేశారు.
టెక్నికల్ గా టీజర్ అత్యున్నతంగా వుంది. పీటర్ హెయిన్ డిజైన్ చేసిన స్టంట్స్ టీజర్ లో హైలెట్ గా నిలిచాయి. మునుపెన్నడూ చూడని యాక్షన్ బ్లాక్స్ అని అద్భుతంగా ఆవిష్కరించాయి.