రామ్ చరణ్ - శంకర్ కాంబోలో క్రేజీ మూవీగా తెరకెక్కుతున్న RC15 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో జరుగుతుంది. అయితే రామ్ చరణ్ - శంకర్ మూవీ టైటిల్ విషయంలో రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉండగా.. అందులో అధికారి టైటిల్ మాత్రం బాగా పాపులర్ అయ్యింది. నిర్మాత దిల్ రాజు అధికారి టైటిల్ ని రిజిస్టర్ చేయించారు అని కూడా ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా.. ఈ సినిమాలో సీఎం పాత్రలో ఎస్ జె సూర్య నటిస్తున్నాడని అంటున్నారు. కానీ RC15 టీం నుండి ఎలాంటి క్లారిటీ లేదు.
అయితే RC 15 పై వస్తున్న పుకార్లని నమ్మవద్దు, RC15 లో ఫలానా నటులు నటించబోతున్నారని వస్తున్న వార్తలు కానీ, టైటిల్ విషయంలో జరుగుతున్న ప్రచారం ఏది నిజం కాదని, అవన్నీ అవాస్తవాలు అంటూ దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. RC15 లో ఏ నటులైనా ఎంపిక చేస్తే మేమే తెలియజేస్తాము, ఏ విధమైన నటులని ఎంపిక చేసే అధికారం ఓ వ్యక్తికి కానీ, సంస్థకి కానీ లేదు, ఇలాంటి పుకార్లని నమ్మొద్దు అంటూ ఆ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేసారు.