అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలయ్య బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ అయిన NBK107 టీజర్ ఫాన్స్ కే కాదు, మాస్ ఆడియన్స్ కి పూనకాలు తెప్పించింది. NBK 107 షూటింగ్ లో భాగంగా రేపు(సోమవారం) కర్నూలులోని కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.