Advertisementt

విజయ్ దేవరకొండ నా ఫేవరేట్ స్టార్

Sun 24th Jul 2022 01:18 PM
miss india,sini shetty,shah rukh khan,bollywood,vijay devarakonda,tollywood  విజయ్ దేవరకొండ నా ఫేవరేట్ స్టార్
Miss India Sini Shetty Says She likes Vijay Devarakonda in Tollywood విజయ్ దేవరకొండ నా ఫేవరేట్ స్టార్
Advertisement
Ads by CJ

లైగర్ పాన్ ఇండియా మూవీ మొదలు పెట్టకముందు నుండే నార్త్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదు. అక్కడి హీరోయిన్స్ చాలామంది విజయ్ దేవరకొండ అంటే క్రష్ అని చెప్పారు కూడా. ఇక ఇప్పుడు లైగర్ మూవీ తో విజయ్ దేవరకొండ ఫ్యాన్ బేస్ పాన్ ఇండియా స్థాయిలో పెరుగుతోంది. సాధారణ ప్రేక్షకుడి నుంచి సెలబ్రిటీల దాకా రౌడీ స్టార్ ఫాన్స్ అని చెప్పుకుంటున్నారు. అలాగే విజయ్ దేవరకొండ స్టయిల్ కి యూత్ ఫిదా అవుతున్నారు. రౌడీ స్టార్ స్టయిల్ ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నారు కూడా. తెరపై ఈ స్టార్ హీరో నటన, వివాదరహితమైన ఆఫ్ స్క్రీన్ వ్యక్తిత్వం, ఛారిటీలకు ముందుండే మంచి మనసు కలిసి విజయ్ ను ప్రతి ఒక్కరూ ప్రేమించేలా చేస్తున్నాయి. 

తాజాగా మిస్ ఇండియా వరల్డ్ గా ఎంపికైన కన్నడ యువతి సినీ శెట్టి  మీకు ఇండియాలో ఏ స్టార్ హీరోస్ అంటే ఇష్టం అని అడిగితే.. హిందీలో షారుఖ్ ఖాన్, తెలుగులో విజయ్ దేవరకొండ తన ఫేవరేట్ స్టార్ అని చెప్పింది. విజయ్ దేవరకొండ అని కలిసే సందర్భం వస్తే చాలా సంతోషిస్తానని తెలిపింది. దీంతో బాలీవుడ్ లో విజయ్ క్రేజ్ పెరిగింది. పలువురు బాలీవుడ్ స్టార్స్ విజయ్ ఫేవరేట్ అని చెప్పుకోవడం ఇప్పుడు మిస్ ఇండియా వరల్డ్ హైదరాబాద్ పర్యటనలో విజయ్ దేవరకొండ ఇష్టం అని చెప్పడం విజయ్ క్రేజ్ కి నిదర్శనం. విజయ్ లేటెస్ట్ మూవీ లైగర్ రిలీజ్ కు ముందే దేశవ్యాప్తంగా సెన్సేషనల్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఇటీవల ముంబైలో ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చిన స్పందన అక్కడి స్టార్స్ ను కూడా ఆశ్చర్యపరిచింది.

Miss India Sini Shetty Says She likes Vijay Devarakonda in Tollywood :

Miss India Sini Shetty Says She likes Shah Rukh Khan in Bollywood and Vijay Devarakonda in Tollywood 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ