గతంలో టాప్ డైరెక్టర్ గా స్టార్ హీరోలతో సినిమాలు చేసిన శ్రీను వైట్లకి ఇప్పుడు అవకాశం ఇచ్చే హీరో కనిపించడం లేదు. అటు కెరీర్ లోను, ఇటు పర్సనల్ లైఫ్ లోను శ్రీను వైట్ల సతమతమవుతున్నాడు. శ్రీను వైట్ల భార్య రూప కి శ్రీను వైట్లకి గత కొన్నేళ్ళుగా పొసగడం లేదు. మధ్యలో పెద్దలు రాజి కుదిర్చినా.. మళ్లీ సఖ్యత లేక విభేదాలు రావడంతో శ్రీను వైట్ల భార్య రూప విడాకుల కోసం నాంపల్లి కోర్టుకి వెళ్లడంతో శ్రీను వైట్ల మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు.
తాజాగా శ్రీను వైట్ల ఎమోషనల్ గా విడాకుల గురించి డైరెక్ట్ గా ప్రస్తావించకుండా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. లైఫ్ చాలా అందమైంది. నచ్చిన వాళ్లతో ఉంటే అది మరింత అందంగా ఉంటుంది. ఈ ముగ్గురు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోవడం అసాధ్యం.. అంటూ తన ముగ్గురు కూతుళ్లతో ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. జీవితంలో ఎంతో బాధాకరమైన విషయాన్ని శ్రీను వైట్ల ఇలా సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ అయ్యాడు.