నాగ చైతన్య థాంక్యూ మూవీ నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. విక్రమ్ కుమార్ దర్శకత్వం, దిల్ రాజు నిర్మాత, చైతు హీరో అంటే సినిమాపై మంచి అంచనాలు ఉండాల్సింది పోయి థాంక్యూ మూవీ అసలు అంచనాలు లేకుండా, బుకింగ్స్ లేకుండా బాక్సాఫీసు బరిలోకి వచ్చింది. థాంక్యూ పై ఆడియన్స్ లో ఊపులేకపోవడం మైనస్ గా మారింది. దానితో 20 శాతం అక్యుపెన్సీతో మొదటి రోజు థాంక్యూ మూవీకి దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. ఎంత దారుణం అంటే.. నాగ చైతన్య కెరీర్ లోనే ఈ మూవీకి వచ్చిన ఓపెనింగ్స్ మరీ వరెస్ట్ అనిపించేంత. ఇక రెండో రోజు బుకింగ్స్ కూడా నామమాత్రంగానే కనబడుతున్నాయి. థాంక్యూ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ ఏరియాల వైజ్ గా..
ఏరియా కలెక్షన్స్
నైజాం 72 లక్షలు
సీడెడ్ 20 లక్షలు
ఉత్తరాంధ్ర 22 లక్షలు
ఈస్ట్ 14 లక్షలు
వెస్ట్ 8 లక్షలు
గుంటూరు 10 లక్షలు
కృష్ణా 12 లక్షలు
నెల్లూరు 7 లక్షలు
ఏపీ అండ్ టీఎస్ రాష్ట్రాల్లో డే1 - 1.65 కోట్లు షేర్
ఇతర ప్రాంతాల్లో 6 లక్షలు
ఓవర్‌సీస్‌లో 45 లక్షలు
ప్రపంచ వ్యాప్తంగా 2.16 కోట్లు షేర్