Advertisementt

విజయ్ దేవరకొండకి ఇచ్చిపడేసిన బండ్ల

Fri 22nd Jul 2022 09:07 PM
bandla ganesh,liger trailer launch,vijay deverakondam mahesh babu,ram charan,ntr,prabhas  విజయ్ దేవరకొండకి ఇచ్చిపడేసిన బండ్ల
Bandla Ganesh Shocking tweet on Vijay Deverakonda విజయ్ దేవరకొండకి ఇచ్చిపడేసిన బండ్ల
Advertisement
Ads by CJ

నిన్న గురువారం హైదరాబాద్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన రౌడీ ఫాన్స్ తో కలిసి రోడ్ మీద ర్యాలిలా బయలుదేరి.. సుదర్శన్ 70MM థియేటర్ లో ఆయన ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం లైగర్ ట్రైలర్ లాంచ్ లో పాల్గొన్నాడు. పూరి జగన్నాధ్, అనన్య పాండే, కరణ్ జోహార్, ఛార్మి కూడా ఈవెంట్ కి హాజరయ్యారు. అయితే గతంలో విజయ్ దేవరకొండ తనకి ఎలాంటి బ్యాగ్ రౌండ్ లేదు.. నాకు నేనుగా ఎదిగాను అంటూ కామెంట్స్ చేసాడు. ఇక లైగర్ ఈవెంట్ లోను విజయ్ దేవరకొండ కాస్త యాటిట్యూడ్ చూపించాడు. ఫాన్స్ ని చూసి రెచ్చిపోయి కామెంట్స్ చేసాడు. తన అభిమానులని ఉద్దేశించి మాట్లాడుతూ రెచ్చిపోయాడు. మీకు మా అయ్య తెల్వదు, మా తాత తెల్వదు, ఎవ్వడూ తెల్వదు, నా సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లవుతుంది.. ఆ సినిమా పెద్ద చెప్పుకునే సినిమా కూడా కాదు, అయినా ట్రైలర్ కి ఈ రచ్చ ఏమిట్రా నాయనా.. అంటూ చేసిన కామెంట్స్ విజయ్ దేవరకొండని చాలామంది విమర్శించేలా చేసాయి.

తాతలు తండ్రులు వారసత్వంగా, బడా సినీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చి స్టార్ హీరోలుగా మారిన అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ లనే విజయ్ టార్గెట్ చేశాడంటూ పెద్ద ఎత్తున ఫిలింసర్కిల్స్ లో చర్చలకు దారి తీశాయి. ప్రముఖులెవరు ఈ విషయమై ఓపెన్ అవ్వకపోయినా.. వాళ్ళ ఫాన్స్ మాత్రం విజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ముందు లైగర్ తో హిట్ కొట్టు.. తర్వాత మట్లాడుదువు గాని అని కామెంట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కాకుండానే కళ్ళు నెత్తికెక్కాయా విజయ్.. ఆ సినిమా పొతే అప్పుడు తెలుస్తుంది అంటున్నారు కొందరు. 

కానీ బండ్ల గణేష్ మాత్రం సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండకి ఇచ్చి పడేసాడు. తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్ లా, మహేష్ బాబు లా, రామ్ చరణ్ లా, ప్రభాస్ లా గుర్తుపెట్టుకో బ్రదర్ 🔥🔥🔥🔥 అంటూ రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు లను టాగ్ చేస్తూ విజయ్ దేవరకొండకి తగిలేలా బాణం వదిలాడు బండ్ల.

Bandla Ganesh Shocking tweet on Vijay Deverakonda:

Bandla Ganesh comments on Vijay Deverakonda

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ