Advertisementt

సమంతకి చైతూ కి అంత పెద్ద గొడవైందా?

Fri 22nd Jul 2022 08:33 PM
samantha,divorce,naga chaitanya,kafee with karan show  సమంతకి చైతూ కి అంత పెద్ద గొడవైందా?
Samantha And Naga Chaitanya Divorce Reasons సమంతకి చైతూ కి అంత పెద్ద గొడవైందా?
Advertisement
Ads by CJ

సమంత - నాగ చైతన్య విడాకులకు అప్లై చేసేవరకు వారు ఎంతో అన్యోన్యంగానే ఉండేవారు, పెళ్ళికి ముందు గుట్టు చప్పుడు కాకుండా కలిసిమెలిసి ఉన్న చైతూ - సామ్ లు, పెళ్లయ్యాక వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేసారు. చైతూ వంట గురించి సమంత చాలాసార్లు చెప్పింది. తర్వాత బయట కూడా వారిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అంత అందమైన జంట విడిపోవడం ఎవరికీ నచ్చలేదు. అయితే విడాకుల తర్వాత సమంత చాలా నెగెటివిటీని ఫేస్ చేసింది. తనలోని బాధని సోషల్ మీడియా రూపంలో బయట పెట్టింది. కానీ నాగ చైతన్య నెమ్మదిగా పనిలో పడిపోయి ఈ విడాకుల మేటర్ ని పక్కనపడేసాడు. 

అయితే తాజాగా సమంత కాఫీ విత్ కరణ్ షో లో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తాము సామరస్యంగా విడాకులు తీసుకోలేదు అంటూ సమంత చేసిన వ్యాఖ్యలు, ఒకే గదిలో ఉంచితే కత్తులు దొరకనివ్వద్దు.. మా మధ్యన సఖ్యత లేదు అని చెప్పడం చూస్తే వారి మధ్యన చాలా పెద్ద గొడవ జరగబట్టే వారిద్దరూ విడిపోయారు అంటూ అక్కినేని అభిమానులతో పాటుగా అందరూ ఫిక్స్ అవుతున్నారు. చైతూ సమంతని ఎక్స్ పోజింగ్ చెయ్యొద్దు అన్నకారణంగానే వారి మధ్యన తీవ్ర విభేదాలు వచ్చి విడిపోయుండొచ్చు అని అప్పట్లో ప్రచారం జరిగినట్లుగానే.. సమంత బాగా హార్ట్ అయ్యి చైతూకి డివోర్స్ ఇచ్చి ఉండొచ్చు అని అందరూ ఇప్పుడు ఓ అంచనాకు వస్తున్నారు.

Samantha And Naga Chaitanya Divorce Reasons:

Samantha shocking comments on Divorce with Naga Chaitanya 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ