Advertisementt

లీకైన ఫోటో తో సోషల్ మీడియా షేక్

Fri 22nd Jul 2022 06:12 PM
godfather,chiranjeevi,salman khan,mohan raja,godfather  లీకైన ఫోటో తో సోషల్ మీడియా షేక్
Social media shake with the leaked photo లీకైన ఫోటో తో సోషల్ మీడియా షేక్
Advertisement
Ads by CJ

మెగా మూవీ గాడ్ ఫాదర్ లో మన చిరంజీవి తో పాటుగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఓ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ మెగాస్టార్ ని-బాలీవుడ్ మెగాస్టార్ ని ఎప్పుడెప్పుడు ఒకే ఫ్రేమ్ లో చూస్తామా అని అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఆ అవకాశం గాడ్ ఫాదర్ ట్రైలర్ తో లభిస్తుంది అని, వెయిట్ చేస్తున్న అభిమానులకి అనుకోకుండా ఓ లీకెడ్ పిక్ రూపంలో ఆ ఛాన్స్ ముందే వచ్చేసింది. గాడ్ ఫాదర్ క్లైమాక్స్ పోర్షన్ కి సంబందించిన షూట్ జరుగుతుండగా.. ఆన్ లొకేషన్ లో ఎవరో ఆకతాయి తీసిన ఫోటో ఉన్నట్టుండి సోషల్ మీడియా వేడుకల్లో ప్రత్యక్షం అయ్యింది. 

ఆ లీకెడ్ పిక్ లో చిరు - సల్మాన్ లు ఒకే ఫ్రేమ్ లో ఉండడం విశేషం. ఇద్దరూ బ్లాక్ డ్రెస్సులతో ఎంతో పవర్ ఫుల్ గా కనిపిస్తున్న గెటప్స్ తో గాడ్ ఫాదర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగానే కనిపిస్తున్నారు. కరెక్ట్ గా క్లారిటీ లేని పిక్ తోనే ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ మెగా కాంబో రేపు థియేటర్స్ వద్ద ఏ రేంజ్ లో సందడి చేస్తుందో.. మాస్ ప్రేక్షకులని ఎలా ఊపేస్తుందో ఊహించుకోవచ్చు. 

Social media shake with the leaked photo:

Godfather: Chiranjeevi and Salman Khan Leaked Picture

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ